హైదరాబాద్:హైద్రాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో శుక్రవారంనాడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ విషయాన్ని గుర్తించిన  సెక్యూరిటీ సిబ్బంది పోలీసులను అప్రమత్తం చేశారు.  మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

హైద్రాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంలో శుక్రవారం నాడు తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో  పోలీస్ స్టేషన్ పరిధిలో పార్క్ చేసిన రికవరీ వాహనాలు దగ్దం అయ్యాయి. మూడు ఫైరింజన్లు మంటలను ఆర్పాయి.