ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నండి రూ. 2.2 కోట్ల నగదును సీజ్ చేశామన్నారు. బెట్టింగ్ యాప్ లను తొలగించాలని గూగుల్ కు లేఖ రాస్తామని ఆయన చెప్పారు.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో ఐపీఎల్ క్రికెట్ (ipl cricket betting ) బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర (stephen ravindra) చెప్పారు.బుధవారం నాడు తన కార్యాలయంలో స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. మియాపూర్, గచ్చిబౌలి, బాచుపల్లి, మైలార్‌దేవ్‌పల్లి తో పాటు ఏడు చోట్ల దాడులు నిర్వహించి ఈ ముఠాను అరెస్ట్ చేసినట్టుగా స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
ఈ ముఠా నుండి రూ. 2.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నామని ఆయన చెప్పారు. గూగుల్‌లో ఉన్న మొబైల్ యాప్ తో బెట్టింగ్ కు పాల్పడుతున్నారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 23 మంది బుకీలను అరెస్ట్ చేశామని సీపీ చెప్పారు.
నాలుగు లేయర్స్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా తాము గుర్తించామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.ముంబై, గోవా, దుబాయ్‌లలో వీరికి నెట్ వర్క్ ఉందని గుర్తించామన్నారు.బెట్టింగ్ యాప్స్ ను తొలగించాలని గూగుల్ కు లేఖ రాస్తామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
