మహేష్ బాబు అమ్మాయిలకు మాత్రమే, కాని కేటీఆర్ అబ్బాయిలకు కూడా

Mahesh Babu Reaction On IT Minister KTR Tweet
Highlights

కేటీఆర్ ట్వీట్ కు మహేష్ సమాధానం 

టాలీవుడ్ లో ఇటీవల పొలిటికల్ డ్రామాగా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా అటు సినీ అభిమానులనే కాదు రాజకీయ నాయకులను అలరించింది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన తెలంగాణ పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ అయితే ఏకంగా హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివతో ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ బాబుకు ఓ అమ్మాయి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సరదాగా జవాబిచ్చాడు. అయితే కేటీఆర్ ఇచ్చిన జవాబును గుర్తు చేస్తూ ఓ అభిమాని ఏకంగా కేటీఆర్ కు ఓ సరదా ట్వీట్ పంపించాడు. 

ఈ ట్వీట్ లో ఆ వ్యక్తి కేటీఆర్ తో అబ్బాయిలు సెల్పీ దిగుతున్న ఫోటో పెట్టి ''నిజమే...కేటీఆర్ గారు అబ్బాయిలకు కూడా సెల్ఫీలు ఇస్తారు'' అంటూ సరదాగా ట్వీట్ చేశారు. అంటే మహేష్ కేవలం అమ్మాయిలకు మాత్రమే సెల్ఫీలు ఇస్తాడు...కానీ నేను అబ్బాయిలతో కూడా సెల్ఫీలు దిగుతానని గతంలో జరిగిన ఇంటర్వూలో కేటీఆర్ అన్న మాటలను ఇతడు గుర్తు చేశాడన్నమాట.

ఈ ట్వీట్ ను మంత్రి కేటీఆర్ కూడా చూసి, దాన్ని మహేష్ బాబుకు ట్యాగ్ చేస్తూ" హ..హ..మహేష్ ఇది నికోసమే'' అని కామెంట్ చేశారు. దీనికి మహేష్ స్పందిస్తూ స్మైలీతో రిప్లై ఇచ్చాడు.  

 

 

loader