మహేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డిల ఆరోగ్యం నిలకడగా ఉంది: ఐటీ అధికారులు
మహేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డిల ఆరోగ్యం నిలకడగా ఉందని ఐటీ అధికారులు తెలిపారు. సోదాలకు సహకరించాలని మంత్రి మల్లారెడ్డిని అధికారులు కోరారు. మహేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డిల ఆరోగ్యం నిలకడగా ఉందని ఐటీ అధికారులు తెలిపారు. సోదాలకు సహకరించాలని మంత్రి మల్లారెడ్డిని అధికారులు కోరారు.
హైదరాబాద్:మహేందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డిల ఆరోగ్యం నిలకడగా ఉందని ఐటీ అధికారులు తెలిపారు. సోదాలకు సహకరించాలని ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డిని కోరారు. ఆసుపత్రి నుండి మంత్రి మల్లారెడ్డిని ఐటీ అధికారులు తీసుకెళ్లారు. మంత్రి మల్లారెడ్డి తనయుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఇవాళ ఉదయం సూరారంలోని నారాయణ హృదయాలయంలో చేర్పించారు. మహేందర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. మంత్రి మల్లారెడ్డి బంధువు ప్రవీణ్ రెడ్డికి బీపీ డౌన్ అయింది. దీంతో ఆయనను కూడా నారాయణ హృదయాలయానికి తరలించారు. ప్రవీణ్ రెడ్డిని వైద్యులు పరీక్షించారు.ప్రవీణ్ రెడ్డిపై సీఆర్‌పీఎఫ్ సిబ్బంది దాడి చేశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఆసుపత్రి నుండి మంత్రి మల్లారెడ్డిని ఇంటికి తీసుకెళ్లారు ఐటీ అధికారులు. సోదాలకు సహకరించాలని ఐటీ అధికారులు కోరారు.
also read:ప్రతిదాడులకు సిద్దం కావాలి: ఈడీ, ఐటీ సోదాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్
నిన్న ఉదయం నుండి తెలంగాణ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల నివాసాల్లో ఐటీ సోదాలు సాగుతున్నాయి. ఈ సోదాలపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయని మల్లారెడ్డి చెప్పారు. గతంలో కూడా తన సంస్థలపై ఐటీ సోదాలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ 500 మంది సిబ్బంది, పోలీసులతో వచ్చి సోదాలు నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. తాను లీగల్ గానే వ్యాపారాలు చేస్తున్నట్టుగా మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తన కొడుకును చూసేందుకు అవకాశం ఇవ్వలేదని ఆసుపత్రి ముందు మంత్రి మల్లారెడ్డి ధర్నాకు దిగారు. ఆసుపత్రి ఎదుట బైఠాయించిన తర్వాత ఆయన ఇంటికి తీసుకెళ్లారు.