Asianet News TeluguAsianet News Telugu

''నేను హిందుత్వాన్ని కాపాడాలనుకోవట్లేదు...సంస్కరించాలనుకుంటున్నా''...గాంధీ జయంతి స్పెషల్ స్టోరీ

''నేను చేస్తున్న పనులతో హిందూత్వం దెబ్బతిన్నా పట్టించుకోను. నేను ఇక్కడికి వచ్చింది హిందూత్వాన్ని కాపాడేందుకు కాదు. నేను ఈ ధర్మాన్ని సంస్కరించాలని అనుకుంటున్నా'' జాతిపిత గాంధీజీ

Mahatma Gandhi Jayanthi special
Author
Hyderabad, First Published Oct 2, 2020, 10:55 AM IST

''సత్య నిష్ఠ'' విషయంలోనూ ప్రపంచంలో ఏ రాజకీయ తత్వవేత్త లేదా ఆధ్యాత్మిక గురువు, లేదా మత నాయకుడు ఇవ్వలేని తార్కాణాన్ని గాంధీజీ ప్రపంచం ముందుంచారు. మహాత్ముడనీ, జాతిపిత ఆనీ పేరెన్నిక గన్న గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన వేలాది నాయకులలో అగ్రగణ్యుడు. గాంధీజీ 1869 అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోరుబందర్‌లో జన్మించాడు. 1948 జనవరి 30న హత్యకు గురైనాడు.

మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. భారతీయులందరూ ఆదరించే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు అతన్ని జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న అతను ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.

గాంధీ పాటించిన ఈ ధర్మం. ప్రపంచంలోని ఏళ్లనాటి ఆచారాలను అనుసరిస్తున్న మతాల గోడలను బద్దలుకొట్టింది. అన్ని మత, ఆధ్యాత్మిక విశ్వాసాలనూ కుదిపింది. మొదట ''దేవుడు.. అంటే సత్యం''అని గాంధీ చెప్పారు.

''ఎవరికి వారు సొంత దేవుణ్ని సృష్టించుకోవడంతో గందరగోళం ఏర్పడింది. మనుషుల్ని చంపడం, అగౌరవ పరచడం, ఆత్మన్యూనత భావానికి గురిచేయడం లాంటివి దేవుడి పేరుతో చేస్తున్నారు"అనే గాంధీజీ భావించారు. దీంతో గాంధీజీ సత్యంపై ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. ''దేవుడే సత్యం’ అన్నది సరికాదు.. ‘సత్యమే దేవుడు''అని చెప్పారు.

''మతం లేదా గ్రంథం లేదా విశ్వాసాలు, సంప్రదాయాలు లేదా స్వామి, గురు, మహంత్, మహాత్మ ఇవేమీ దేవుడు కాదు.. కేవలం సత్యం మాత్రమే.. కేవలం సత్యం''అని ఆయన అన్నారు. సత్యాన్వేషణ, సత్యాన్ని గుర్తించడం, సత్యాన్ని ప్రజల ముందుకు తీసుకు వచ్చేందుకు కృషి చేయడం.. ఇవే గాంధీ మతం.. ఇవే ప్రపంచ మతం.. ఇవే మానవత్వ మతం..

గాంధీజీ దక్షిణ భారత్ యాత్రలో అందరూ ఆయన వెనకేవచ్చారు. దేవాలయాల్లోకి హరిజనుల ప్రవేశంపై నేరుగానే ప్రశ్నలు సంధించారు. ఇలాంటి చర్యలతో హిందుత్వం భావన ధ్వంసమవుతుందని వాదించారు. నేను చేస్తున్న పనులతో హిందూత్వం దెబ్బతిన్నా పట్టించుకోను. నేను ఇక్కడికి వచ్చింది హిందూత్వాన్ని కాపాడేందుకు కాదు. నేను ఈ ధర్మాన్ని సంస్కరించాలని అనుకుంటున్నా''అని అక్కడకు వచ్చిన లక్షలాది మందికి గాంధీ చెప్పారు. అనంతరం హరిజనుల కోసం ఎన్నో దేవాలయాలు తెరచుకున్నాయి. ఎన్నో దురాచారాలు, సంకుచిత విధానాలు, భావనలు కనుమరుగు అయ్యాయి.

బుద్ధుడి తర్వాత సామాజిక-మత దురాచారాలపై ఎవరైనా గట్టి, లోతైన ప్రభావం చూపారా అంటే.. వెంటనే గాంధీజీ పేరే చెప్పాలి. ఇలాంటి సామాజిక భూతాలను తరిమే క్రమంలో గాంధీ ఓ కొత్త మత వర్గాన్నీ సృష్టించలేదు. ఎలాంటి కొత్త అభిప్రాయాలనూ లేవనెత్తలేదు. భారత స్వాతంత్ర్య ఉద్యమం బలహీన పడకుండా ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్లారు.

గాంధీ గురించి ప్రముఖుల అభిప్రాయాలు :-

అహింస:- డార్వెన్, లంకషైర్ టెక్స్టైల్ కార్మికులతో గాంధీజీ, 1931 సెప్టెంబరు 26. అహింసను కనిపెట్టినది గాంధీజీ కాదుగాని, అహింసను భారీస్థాయిలో రాజకీయాలలో మొదట ఉపయోగించిన వ్యక్తి గాంధీజీ. అహింస సిద్ధాంతాన్ని భారతీయ ఆధ్యాత్మిక ఆలోచనా విధానంలోనూ, హిందు, బౌద్ధ, జైన, యూదు, క్రైస్తవ మతాల్లోనూ పలుమార్లు పేర్కొన్నారు. గాంధీజీ తన విలువలనూ, జీవన విధానాన్నీ తన ఆత్మకథలో వివరించాడు. అహింసను ఆచరించాలంటే గొప్ప నమ్మకం, ధైర్యం కావాలనీ, అయితే ఇవి అందరిలో లేవనీ గ్రహించాడు. అందుకే అహింస అందరికి పాటించటం కష్టం అనీ, ముఖ్యంగా పిరికితనాన్ని కప్పివుంచటానికి వాడరాదనీ, ఒకవేళ పిరికితనం, హింస రెండింటిలో ఒకటి ఎన్నుకోవలసినప్పుడు తాను హింసను ఎన్నుకోవలసిందిగా సలహా ఇస్తానన్నాడు.

హింసా విధానాల ద్వారా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వారి ప్రయత్నాలను నిరసించడంతో గాంధీజీ వారి కోపానికిగురయ్యాడు. ముఖ్యంగా భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, ఉదమ్‌సింగ్‌ల ఉరిశిక్షలకు వ్యతిరేకంగా నిరసన చేయలేదని కొన్ని వర్గాలు నిందించాయి. ఈ విమర్శలకు జవాబుగా గాంధీజీ ఏమన్నాడంటే- "బ్రిటీషు వారితో ఆయుధాలు లేకుండా పోరాడాలని చెబితే ప్రజలు ఆచరించారు. 

అంటరానితనం:- అంటరానితనం పోవాలని గాంధీ పదే పదే అంటున్నా, దేవాలయలలో హరిజనులకు ప్రవేశం వుండాలన్నా తదనుగుణంగా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాడని అంబేద్కర్ విమర్శించాడు.

"ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు"- ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్

"మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ ఆభిప్రాయాలు మేలైనవి. అతను చెప్పినట్లుగా మనం నడచుకోవాలి. మనకు కావలసినదాని కోసం హింసతో పోట్లాడటము కాదు. ఆన్యాయమని మనకు తోచినదానికి ఏ మాత్రమూ సాయము చేయకుండా ఉండటము మన బాధ్యత" - ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్

"జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు" -మార్టిన్ లూథర్ కింగ్

సత్యాన్వేషణ, సత్యాన్ని గుర్తించడం, సత్యాన్ని ప్రజల ముందుకు తీసుకు వచ్చేందుకు కృషి చేయడం.. ఇవే గాంధీ మతం.. ఇవే ప్రపంచ మతం.. ఇవే మానవత్వ మతం.
 

Follow Us:
Download App:
  • android
  • ios