బీఆర్ఎస్‌లో దేశవ్యాప్తంగా చేరికల పరంపర కొనసాగుతున్నది. తాజాగా, మహారాష్ట్ర నుంచి పలు పార్టీలకు చెందిన నేతలు.. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.  

హైదరాబాద్: మహారాష్ట్ర పలు పార్టీల నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశవ్యాప్తంగతా విస్తరించాలనే ఆలోచనలో తాము భాగస్వామ్యం కావాలనుకుంటున్నట్టు ఆ నేతలు తెలిపారు. తమ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలు అమలు చేయడానికి, ఆ పార్టీ కలలు గంటున్న అభివృద్ధికి పాటుపడటానికి తాము కృషి చేస్తామని అన్నారు. దేశంలో కిసాన్ సర్కార్ ఏర్పాటు కోసం పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలకు లోబడి పార్టీ బలోపేతానికి పని చేస్తామని మహారాష్ట్ర నేతలు అన్నారు.

మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వసంత్ రావ్ బోండే, కాంగ్రెస్ పార్టీ మాజీ జనరల్ సెక్రెటరీ విఠల్ నాయక్, కాంగ్ెస్ పార్టీ జెడ్‌పీ సభ్యులు సరిత వర్కడ్, కిన్వత్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన ఎంఎన్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధన్ లాల్ పవన్, నాందేడ్ జెడ్‌పీ సభ్యుడు నందతాయ్ పవార్, నాందేడ్ జిల్లా మాజీ అధ్యక్షులు సునిత బబలికన్, ఎన్సీపీ మహిళా అఘాడీ జిల్లా మాజీ జనరల్ సెక్రెటరీ యశోదతాయ్ కోలి, పర్హాన్ జనశక్తి పార్టీ తాలూకా మాజీ అధ్యక్షులు దిలీప్ నాయక్‌లు పార్టీలో చేరారు. వీరితోపాటు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహ్మద్ షోయబ్, ఏబీవీపీ సహాయ్ సంయోజక్ కృష్ణ ఇంగిల్, ఏబీవీపీ ప్రెసిడెంట్ జాషశ్రీ ఇల్లెదుల, వంచిత్ బహుజన్ పార్టీ కార్యదర్శి సోలంకి, నాందేడ్ బార్ అసోసియేషన్ సభ్యులు గణేష్ జాదవ్ సహా పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read: త్వరలో బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారు.. సీబీఐ, ఈడీ, ఐటీలు రెడీ : ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

వీరితోపాటు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి మరికొందరు జెడ్‌పీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. వారిలో లింబ్ గావ్ నాందేడ్ నార్త్ జెడ్‌పి నియోజకవర్గం నుంచి సాహెబ్ రావు ధనగే, కుర్ల కాంధార్ జెడ్ పీ నియోజకవర్గం నుంచి బాలాసాహెబ్ గమారే, కిన్వత్ నియోజకవర్గం మాజీ వైస్ చైర్మన్లు, జెడ్‌పీ నాందేడ్ సమాధాన్ జాదవ్, ప్రకాశ్ గబ్బా సహా పలువురు ఉన్నారు. ఈ చేరికల కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు.