Asianet News TeluguAsianet News Telugu

Maharashtra Assembly Election Results 2019: నాగ్‌పూర్ సౌత్‌లో దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజ

మహారాష్ట్రలో గురువారం నాడు జరిగిన ఉప ఎన్నికల్లో నాగ్‌పూర్ సౌత్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో కొనసాగుతున్నారు. 

Devendra Fadnavis in Nagpur South West Election Results 2019: Fadnavis of BJP Leads
Author
Mumbai, First Published Oct 24, 2019, 9:15 AM IST


హైదరాబాద్: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీకి ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ దఫా కూడ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  ఈ దఫా కూడ  బీజేపీ, శివసేన కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.

మహారాష్ట్రలో గత ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో  కాంగ్రెస్  పార్టీ మట్టికరిచింది. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్  సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ దఫా దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ నుండి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో ఫడ్నవీస్‌ తన సమీప అభ్యర్ధి కంటే  ముందంజలో ఉన్నారు.

Read more Election Results 2019:పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ ముందంజ...
మహారాష్ట్ర ఎన్నికలు ఈ పర్యాయం అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శివ సేన పార్టీ వ్యవస్థాపక కుటుంబం నుంచి తొలిసారి ఒక వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రస్తుత శివ సేన చీఫ్ ఉద్దవ్ థాక్రే తనయుడు, బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే ఈ సరి బరిలో నిలిచారు. 

రైతుల,రైతాంగ సమస్యలు ఈ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నా, మోడీ ఇమేజ్ వల్ల, సరైన ప్రతిపక్షం లేని కారణంగా ఇక్కడ బీజేపీ శివ సేనల కూటమి గెలుపు నల్లేరు మీద నడకని పండితులంతా ఊహిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన పార్టీ ఫిరాయింపులు ఇటు కాంగ్రెస్ ను అటు ఎన్సీపీని తీవ్రంగా నష్టపరిచాయి. 

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

Read more election result 2019 video : యమున దాటడమే మిగిలింది బిజేపీపై దుష్యంత్ కామెంట్స్...

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

మరోపక్క ప్రతిపక్ష పార్టీలేమో ఇతి కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని దుమ్మెత్తిపోశాయి. వారి అసమర్థత వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దేశంలోని ఆర్ధిక సంక్షోభానికి వారి అనాలోచిత నిర్ణయాలైన నోట్ల రద్దు,జీఎస్టీలే కారణమని రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విరుచుకు పడ్డారు. 

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు తహ తహలాడుతున్న బీజేపీ శివసేన తోని పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. పొత్తుల్లో భాగంగా బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తుండగా శివ సేన 126 సీట్లలో పోటీకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేస్తుండగా,ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీకి దిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios