మహబూబాబాద్:  మహబూబాబాద్ పట్టణంలో 9 ఏళ్ల దీక్షిత్ రెడ్డిని హత్య చేసిన మందసాగర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.
ఈ నెల 18వ తేదీన దీక్షిత్ రెడ్డిని మంద సాగర్ కిడ్నాప్ చేశాడు. ఈ నెల 22వ తేదీన మహబూబాబాద్ సమీపంలో దీక్షిత్ డెడ్ బాడీని గుర్తించారు.

సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే మందసాగర్ దీక్షిత్ రెడ్డిని మందసాగర్ కిడ్నాప్  చేశాడు.పెట్రోల్ బంకుకు వెళ్తామని చెప్పి దీక్షిత్ ను సాగర్ కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసిన గంటలోపుగానే దీక్షిత్ ను నిందితుడు హత్య చేసినట్టుగా పోలీసులు ఈ రిపోర్టులో పేర్కొన్నారు.

also read:దీక్షిత్ ను మందసాగర్ ఇలా కిడ్నాప్ చేశాడు (ఫొటోలు)

బాలుడిని హత్య చేసిన  తర్వాత దీక్షిత్ తల్లిదండ్రులకు  డింగ్ టాక్ యాప్ ద్వారా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీక్షిత్ ను కిడ్నాప్ చేసిన తర్వాత  తల్లిదండ్రులు రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకొనేందుకు గాను సాగర్ వారి ఇంటికి వెళ్లినట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు.

మంచినీళ్లలో నిద్రమాత్రలను కలిపి దీక్షిత్  కు తాగించినట్టుగా పోలీసులు తెలిపారు. డబ్బులు డిమాండ్ చేసిన తర్వాత బాధిత కుటుంబం కదలికలను ఆయన ఎప్పటికప్పుడు పరిశీలించినట్టుగా పోలీసులు చెప్పారు.

దీక్షిత్ రెడ్డికి ఫోన్ చేసిన తర్వాత తన షాపులో ఉండే రంజిత్ రెడ్డి కదలికలను సాగర్ గుర్తించినట్టుగా ఈ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఏడాదిగా తన ప్రియురాలికి ఈ యాప్ ద్వారానే ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.