Madhya Pradesh: ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని నమ్మించిన ఓ వ్యక్తి... వాటిని ఇంటి నుంచి తరిమివేస్తానని నమ్మించి ఓ మైనర్ బాలికపై ఆరు నెలలుగా లైంగికదాడి పాల్పడ్డాడు. ఈ ఘోరం మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
Madhya Pradesh: శాస్త్రసాంకేతిక రంగాల్లో తిరుగులేని సంచలనాలు సృష్టిస్తూ.. చంద్రునిపై కాలనీలు నిర్మించే దిశగా ముందుకు సాగుతున్న నేటి సమాజంలో ఇంకా మూఢనమ్మకాల పేరిట దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి... ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని ఓ కుటుంబాన్ని నమ్మించి.. ఓ మైనర్ బాలికపై ఆరు నెలలుగా లైంగికదాడికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి ఇంటి నుండి దుష్టశక్తులను తరిమికొట్టేలా నటిస్తూ మైనర్‌పై 6 నెలల పాటు అత్యాచారం చేశాడు ఓ పండ్ల వ్యాపారి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని హబీబ్‌గంజ్‌కు చెందిన 30 ఏళ్ల ఓ వ్యక్తి పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఓ కుటుంబాన్ని తన మాయమాటలతో నమ్మించి.. ఇంటి నుంచి దుష్టశక్తులను తరిమేస్తానని చెప్పి... 14 సంవత్సరాల ఓ 10వ తరగతి విద్యార్థినిపై ఆరు నెలలపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.
నిందితుడు మొదటగా బాధిత కుంటుంబ ఇంటికి వచ్చినప్పుడు మాయమాటలు చెప్పి వారిని తనవైపు తిప్పుకున్నాడు. వారి ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని వారిని నమ్మించాడు. వారికి ఆదృష్టం తెప్పిస్తాననీ, ఇంటి నుంచి దుష్టశక్తులను తరిమేస్తానని పేర్కొంటూ.. బాలికపై మొదట అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌ల వ్యాపారి. ఆమె తల్లి ఓ ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, కోవిడ్-ప్రేరిత లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయింది. ఆమె తండ్రి వ్యాపారంలో నష్టాలబారినపడ్డాడు. నిరాశకు గురైన ఈ కుటుంబ పరిస్థితులు మెరుగుపర్చడానికి ఓ పరిచయమున్న వారు ఓ వ్యక్తి పరిచయం చేశారు. అతను ఇంట్లో ప్రత్యే పూజలు చేయడం ప్రారంభించడాడు.
నిందితులు వారానికి రెండుసార్లు బాధితురాలి ఇంటికి వచ్చేవారు. ఇక దుష్టశక్తులను తరిమివేయడానికి నిర్వహించే ఈ పూజల సమయంలో ప్రత్యేక గదుల్లో ఉండాలని చెప్పారు. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు వేరు వేరు గదుల్లో ఉన్న సమయంలో మొదటగా నిందితుడు బాలికను భయపెట్టాడు. ఆమె తనతో శారీరకంగా ఉండటానికి అనుమతించకపోతే దుష్టశక్తుల ఆత్మ ఆమె తల్లిదండ్రులను చంపేస్తుందని బెదిరించాడు. దీందో భయపడి పోయిన బాలికపై ఆ వ్యక్తి లైంగికదాడికి పాల్పడుతూ వస్తున్నాడు.
ఆరు నెలలు ఇలా దుష్టశక్తులను వెళ్లగొట్టే ప్రత్యేక పూజల పేరుతో మైనర్ పై లైంగికదాడి చేశాడు. తాజాగా తాను దుష్టశక్తులను, ఇతర ఆత్మలను ఇంటినుంచి తరిమికొట్టాని బాధిత కుటుంబానికి చెప్పాడు. ఇప్పటి నుంచి మళ్లీ ఇంటికి రావాల్సిన అవసరం లేదని నిందితుడు చెప్పాడు. దీంతో బాధిత బాలిక ధైర్యం చేసి తన తల్లిదండ్రులకు జరిగిన ఘోరం గురించి చెప్పింది. బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
