ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకీ రాకూడదు.. మధులిక తండ్రి

First Published 21, Feb 2019, 11:22 AM

తమ కుమార్తె మధులికకు ఎదురైన పరిస్థితి మరే ఆడపిల్లకు రాకూడదని మధులిక తండ్రి అన్నారు. ఇటీవల 15రోజుల క్రితం ఇంటర్ విద్యార్థిని మధులికపై భరత్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.

తమ కుమార్తె మధులికకు ఎదురైన పరిస్థితి మరే ఆడపిల్లకు రాకూడదని మధులిక తండ్రి అన్నారు. ఇటీవల 15రోజుల క్రితం ఇంటర్ విద్యార్థిని మధులికపై భరత్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. అతడి దాడిలో గాయపడిన మధులిక మలక్‌పేట యశోద ఆస్పత్రిలో 15 రోజులపాటు ప్రాణాలతో పోరాడి చివరకు ప్రాణాపాయం నుంచి బయటపడింది.

ఏడు శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ల బృందం ఆమె ప్రాణాలను కాపాడారు. ఆరోగ్యం కుదుటపడడంతో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అనంతరం వైద్యుల బృందం, మధులిక తండ్రి రాములు మీడియాతో మాట్లాడారు.

ప్రేమోన్మాది దాడిలో గాయపడిన తన బిడ్డ ఇక బతకదని అనుకున్నట్లు చెప్పారు.  రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చేసిన ప్రార్థనల వల్లే తన కుమార్తె బతికి బయటపడిందన్నారు. యశోద ఆస్పత్రి వైద్యులు తన కుమార్తెను బతికించారన్నారు. ఈ సందర్భంగా ఆయన  అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

వైద్యులకు పాదాభివందనాలు చేస్తున్నానన్నారు. నాయకుల భరోసా, ప్రభుత్వ సాయం మరువలేనన్నారు.  ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 5 లక్షల చెక్కు ఇచ్చిందన్నారు. ఆస్పత్రికి మరో రూ. 8 లక్షలు చెల్లించాల్సి ఉందని.. అవి కూడా అందిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.