తెలంగాణ రాష్ట్రంలోని పోలీస్ శాఖలో  పనిచేస్తున్న 5684 మంది పోలీస్ సిబ్బందిలో  ఆగష్టు మాసానికి సుమారు 43 మంది మరణించారు.హైద్రాబాద్ నగరంలో పనిచేస్తున్న పోలీసుల్లో ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు.

హైద్రాబాద్ పట్టణంలోని హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిల్లో పనిచేస్తున్న పోలీసుల్లో సుమారు 1967 మంది కరోనా బారినపడ్డారని నివేదికలు చెబుతున్నాయి.  కరోనా బారినపడిన వారిలో 1053 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనా కారణంగా ఆగష్టు మాసానికి సుమారు 23 మంది కరోనాతో పోలీసు సిబ్బంది మరణించినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

లాక్‌డౌన్ సమయంలో పోలీసు సిబ్బంది  చేసిన సేవలపై పలువురు అభినందించారు. ఈ సమయంలో పోలీసులు చేసిన సేవల కారణంగా కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా నివారించారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

శుక్రవారం నాటికి తెలంగాణలో కరోనా కేసులు  1,67,046కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించారు. కరోనాతో రాష్ట్రంలో 1016 మంది మరణించారు.రాష్ట్రంలో కరోనా కేసుల ను అరికట్టేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. జీహెచ్ఎంసీలో కరోనా కేసుల వ్యాప్తి కొంత తగ్గినట్టుగా కన్పిస్తోంది. కానీ జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.