Asianet News TeluguAsianet News Telugu

మాదాపూర్ డ్రగ్స్ కేసు: హైద్రాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ లో కలహర్ రెడ్డి, సూర్య లొంగుబాటు

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితులుగా  ఉన్న కలహర్ రెడ్డి, సూర్యలు  హైద్రాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

Madhapur drugs case: Kalahar reddy , surya Surrendered Before gudimalkapur police station lns
Author
First Published Sep 26, 2023, 2:26 PM IST

హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో  నిందితులుగా  ఉన్న  కలహర్ రెడ్డి,  ఓ పబ్ ఓనర్ సూర్యలు  మంగళవారంనాడు హైద్రాబాద్ గుడిమల్కాపూర్  పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మరోవైపు ఇదే కేసులో సాయి అనే నిందితుడు నార్కోటిక్ బ్యూరో అధికారుల ముందు  లొంగిపోయాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముందస్తు బెయిల్ కోసం  కలహర్ రెడ్డి,  సూర్య, సాయిలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే  పోలీసుల ఎదుట లొంగిపోవాలని హైకోర్టు నిందితుకుల సూచించింది. దీంతో  గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ లో కలహర్ రెడ్డి,  ఓ పబ్ ఓనర్ సూర్యలు  లొంగిపోయారు. మరో వైపు  నార్కోటిక్స్  బ్యూరో అధికారుల ముందు సాయి లొంగిపోయాడు. 

హైద్రాబాద్ లోని ప్రతి డ్రగ్స్ కేసులో  కింగ్ పిన్ గా కలహర్ రెడ్డి ఉన్నట్టుగా  పోలీసులు చెబుతున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఈ ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే  ఈ ముగ్గురు కూడ మాదాపూర్ డ్రగ్స్ కేసులో  ముందస్తు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. అయితే  పోలీసుల ముందు లొంగిపోవాలని హైకోర్టు సూచించడంతో  నిందితులు పోలీసుల ముందు లొంగిపోయారు.  

ఇదిలా ఉంటే నిందితులకు  41 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆగస్టు 31న  మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ పై  నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దాడి చేశారు. ఈ అపార్ట్ మెంట్ లో  డ్రగ్స్ తీసుకుంటారని కచ్చితమైన సమాచారం ఆధారంగా అధికారులు దాడులు చేశారు.   సినీ ఫైనాన్షియర్  వెంకట్, బాలాజీ, కె. వెంకటేశ్వర్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన నిందితులను విచారించిన  అధికారులు  మరికొందరిని విచారించారు.

also read:మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్: సినీ నిర్మాతలకే వెంకట్ టోకరా, పెళ్లి మోసం కూడా..

మాదాపూర్ డ్రగ్స్ కేసులో  సినీ నటుడు నవదీప్ పై కూడ హైద్రాబాద్ సీపీ  సీవీ ఆనంద్ ఆరోపణలు చేశారు.ఈ కేసులో  నవదీప్ ను పోలీసులు విచారించారు.  ఇదిలా ఉంటే  హైద్రాబాద్ లో జరిగే డ్రగ్స్ పార్టీల్లో  కలహర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.  ఈ విషయమై  కలహర్ రెడ్డిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios