మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్: సినీ నిర్మాతలకే వెంకట్ టోకరా, పెళ్లి మోసం కూడా..
హైద్రాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. ఐఆర్ఎస్ అధికారి అవతారమెత్తి పలువురి నుండి వెంకట్ డబ్బులు వసూలు చేశారని దర్యాప్తు బృందం గుర్తించిం
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ డ్రగ్స్ కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలను దర్యాప్తు బృందాలు గుర్తించాయి. మాదాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న సమాచారం తో యాంటీ నార్కోటిక్స్ బృందం దాడి చేసింది. సినీ ఫైనాన్షియర్ వెంకట్, బాలాజీ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వెంకట్ పై 25కు పైగా కేసులున్న విషయాన్ని దర్యాప్తు బృందం గుర్తించింది. ఐఆర్ఎస్ అధికారిగా చెప్పుకుంటూ వెంకట్ మోసాలకు పాల్పడినట్టుగా దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది. సినీ నిర్మాతలు సి.కళ్యాణ్, రమేష్ ల నుండి కూడ ఐఆర్ఎస్ అధికారిగా చెప్పుకొని వెంకట్ డబ్బులు వసూలు చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.
ఐఆర్ఎస్ అధికారిగా చెప్పుకుంటూ పెళ్లి చేసుకుంటానని అమ్మాయిలను కూడ మోసం చేసినట్టుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయని సమాచారం.ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వెంకట్ డబ్బులు వసూలు చేశారని కూడ దర్యాప్తు బృందాలు గుర్తించాయి. మరో వైపు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని మహిళలకు ఆశచూపి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టుగా కూడ పోలీసులు తమ విచారణలో తేల్చారు. సినీ, రాజకీయ ప్రముఖులతో వీకేండ్ పార్టీలు నిర్వహిస్తూ వారిని బురిడీ కొట్టించినట్టుగా విచారణలో తేల్చారు.
also read:మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్... సినీ అవకాశాల ఆశజూపి అమ్మాయిలతో వ్యభిచారం
గతంలో కూడ వెంకట్ పై వ్యభిచారం నిర్వహించారనే కేసులు కూడ ఉన్నాయని పోలీసులు గుర్తు చేస్తున్నారు. హైద్రాబాద్ నగరంలోని మాదాపూర్ అపార్ట్ మెంట్ లో పలు రకాల డ్రగ్స్ ను యాంటీ నార్కోటిక్స్ బృందం గుర్తించింది.నిందితుడి వాట్సాప్ చాట్ ఆధారంగా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ ఎవరెవరికి విక్రయించారనే దానిపై దర్యాప్తు బృందాలు విచారణ చేస్తున్నారు. 18 మందికి డ్రగ్స్ విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ 18 మంది ఎవరనే విషయమై దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి.