Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ లో చిగురించిన పాత ప్రేమ.. అక్రమ సంబంధానికి దారి తీసి...

ఈ క్రమంలో రమ్యకి జగిత్యాలకు చెందిన వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. కాగా రమ్య భర్త తాగుడికి బానిసై పది నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె పుట్టింటికి చేరింది.

lovers commits suicide in warangle over illicit relationship
Author
Hyderabad, First Published May 15, 2020, 2:01 PM IST

వారిద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. అయితే.. వారి పెళ్లికి ఇరువైపులా పెద్దలు నిరాకరించారు. దీంతో.. పెళ్లి పీటలు ఎక్కాళ్లిన వారి ప్రేమ.. అక్కడితో ఆగిపోయింది. వారి ప్రేమకు పులిస్టాప్ పడిపోయింది. దీంతో యువతికి వాళ్ల ఇంట్లో వాళ్లు వేరే పెళ్లి నిశ్చయించారు. పెళ్లి కూడా చేసేశారు. ఇక్కడితో కథ అయిపోయిందని అందరూ అనుకోగా .. లాక్ డౌన్ తో మరోసారి పాత ప్రేమికులు ఎదురుపడ్డారు. మళ్లీ వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలంలోని అంబాల గ్రామానికి చెందిన గండ్రకోట రాజ్ కుమార్(30) అదే గ్రామాని కి చెందిన రమ్య(27) పదేళ్ల కింద ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్లికి పెద్దలు నిరాకరించారు.

ఈ క్రమంలో రమ్యకి జగిత్యాలకు చెందిన వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. కాగా రమ్య భర్త తాగుడికి బానిసై పది నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె పుట్టింటికి చేరింది.

రమ్య వివాహానంతరం రాజ్‌కుమార్‌  గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన రమను వివాహం చేసుకొని హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. లాక్‌డౌన్‌తో రాజ్‌కుమార్‌ స్వగ్రామం అంబాలకు వచ్చి కుటుంబంతో ఇక్కడే ఉంటున్నాడు. 

ఈ క్రమంలో రాజ్‌కుమార్‌ రమ్యతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. పదిహేను రోజుల కిందట రాజ్‌కుమార్‌కు ఆయన భార్యతో గొడవ జరగి ఆమె పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన రాజ్‌కుమార్‌ బుధవారం రమ్యతో ఆటోలో నడికూడ మండలం ధర్మారం గుట్టల వద్దకు వెళ్లారు.. ఏమయిందో ఏమో.. కుంటలో వారి శవాలు కనిపించాయి.  

సీఐ మహేందర్‌రెడ్డి, దామెర, పరకాల ఎస్సైలు భాస్కర్‌రెడ్డి, వెంకటకృష్ణ, నడికూడ తహసీల్దార్‌ కోమి, సర్పంచ్‌ ఉమ  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. రమ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌కుమార్‌, రమ్య ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios