హైదరాబాద్ లో ఒక యువకుడు ప్రేమ విఫలమై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం హైదాబాద్ లోని మల్కాజిగిరిలోని వినాయక్ నగర్ లో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ప్రేమ విఫలం కావడంతో వినాయక్ నగర్ కు చెందిన అజ్మీర్ సాగర్ అనే విద్యార్థి మెడకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉరేసుకునే సమయంలో ఆ యువకుడు తాను ప్రేమించిన యువతికి వీడియో కాల్ చేశాడు. అయితే ఆ యువతితోపాటు మరో యువతి కూడా ఆ వీడియో కాల్ లో లైవ్ లో ఉన్నారు.

సాగర్ కేవలం ఆట పట్టించేందుకు ఇలా చేస్తున్నాడనుకుని ఆ యువతులిద్దరూ సరదాగానే లైవ్ లో మాట్లాడుతున్నారు. కానీ సాగర్ మాత్రం సీరియస్ గా వెళ్లి ఉరితాడు మెడకు బిగించుకున్నాడు. వెంటనే ప్రాణాలు కోల్పోయాడు.

మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్న వీడియో కింద ఉంది.