హైదరాబాద్‌లో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ప్రియుడు మృతిచెందగా.. ప్రియురాలు చావు బతుకుల్లో ఉంది. వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా రాగన్నగూడకు చెందిన సందీప్‌రెడ్డి అతని మరదలు త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు,

త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇరు కుటుంబాల మధ్య వీరి ప్రేమ విషయంపై గొడవ జరగడంతో తమకు పెళ్లి జరగదని ప్రేమ జంట తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో  దిల్‌సుఖ్‌నగర్‌ రాజధాని థియేటర్‌ సమీపంలో గదిలో సోమవారం రాత్రి కూల్‌డ్రింక్‌లో విషపు గుళికలు కలుపుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

ఉదయం వీరిని గమనించిన స్థానికులు వెంటనే కమలా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సందీప్ రెడ్డి మరణించాడు... త్రివేణి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు.