తమ పెళ్లికి అంగీకరించలేదని ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతేనగర్ కు చెందిన హర్షిత అనే యువతి రమేష్ అనే యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు కొరియర్ బాయ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు... పెళ్లి చేసుకోవాలని భావించారు. అందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. ఆమె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ విషయం తెలుసుకున్న రమేష్... హర్షిత ఇంటికి సమీపంలోని ఓ భవనం పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.