Asianet News TeluguAsianet News Telugu

మూగ ప్రేమ జంట.. పెళ్లికి అంగీకరించని పెద్దలు.. చివరకు

ఇద్దరి మతాలు వేరుకావడంతో పాటు ఇదివరకే మస్తాన్‌వలీకి పెళ్లయి భార్య కూడా ఉండడంతో ఇరు కుటుంబాలూ వారి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి షేక్‌ మస్తాన్‌ వలీ, అశ్విని ద్విచక్ర వాహనంపై నాగార్జునసాగర్‌కి వచ్చారు.
 

love couple commits suicide in Nalgonda
Author
Hyderabad, First Published Sep 11, 2020, 11:41 AM IST

వాళ్లిద్దరూ పుట్టుకతో మూగవారు. ఇద్దరూ ఒకే కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కాగా.. అలా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే.. ఆ యువకుడికి అప్పటికే పెళ్లి కావడం, ఇద్దరు మతాలు కూడా వేరుకావడంతో.. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. ఆ మూగ ప్రేమ జంట కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నల్గొండలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా శ్రీనివాసరావుపేట గ్రామానికి చెందిన షేక్‌ మస్తాన్‌ వలీ (27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన కుటుంబంతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. అతనికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న నిజామాబాద్‌ జిల్లా ఎడవెల్లి మండలం జక్కంపేట గ్రామానికి చెందిన నందిపాటి అశ్విని (20) కూడా అతనితో పాటే అదే కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

 ఇద్దరూ చెవిటి, మూగవారు. ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన అశ్విని కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. ఇద్దరి మతాలు వేరుకావడంతో పాటు ఇదివరకే మస్తాన్‌వలీకి పెళ్లయి భార్య కూడా ఉండడంతో ఇరు కుటుంబాలూ వారి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి షేక్‌ మస్తాన్‌ వలీ, అశ్విని ద్విచక్ర వాహనంపై నాగార్జునసాగర్‌కి వచ్చారు.

 ఈనెల ఏడో తేదీన ఇంటినుంచి బయటకు వెళ్లిన అశ్విని తిరిగి రాలేదని ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నాగార్జునసాగర్‌లో బుధవారం రాత్రి వరకు ఉన్న ప్రేమజంట ఆ తర్వాత అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై అనుముల మండలంలోని పాలెం స్టేజీ సమీపంలో ఉన్న రైతు కర్ణం శేషయ్య పొలం వద్దకు వచ్చారు. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారు. అయితే అంతకుముందు నాగార్జునసాగర్‌లో ఉన్నప్పుడే తాము చనిపోతున్నట్టు (సైగల ద్వారా) వారు సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపారు.

 దీంతో మస్తాన్‌వలీ, అశ్విని ఆచూకీ కోసం వారి స్నేహితులు సాగర్‌కి వచ్చారు. గూగుల్‌ లొకేషన్‌ ద్వారా ఆరా తీసుకుంటూ గురువారం ఉదయం అనుముల మండలంలోని పాలెం స్టేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడ వ్యవసాయ పొలంలో విగతజీవులుగా పడివున్న ప్రేమజంటను చూసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ మృతుల ఆధార్, ఐడీ కార్డులు లభించడంతో వాటి ఆధారంగా షేక్‌ మస్తాన్‌వలీ, అశ్వినిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios