షాద్ నగర్ :రంగారెడ్డి జిల్లా షాద్ నగర్  మండలం మొగిలిగిద్దలో ప్రేమ  వ్యవహారం తల్లీ కూతుళ్ల ప్రాణాలను బలిగొన్నాయి.  ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్దకు చెందిన స్రవంతి అదే గ్రామానికి చెందిన  యువకుడిని ప్రేమించింది.  ఈ విషయం తెలిసిన తండ్రి పాండు మండిపడ్డారు.వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడంతో తల్లీ కూతుళ్లపై మండిపడ్డాడు. భార్య, కూతురుపై ఇవాళ పాండు గొడవపెట్టుకొన్నాడు. 

వేరే కులానికి చెందిన యువకుడిని  కూతురు ప్రేమించడం వల్లే పాండు తట్టుకోలేకపోయాడు ఈ విషయమై భార్యతో పాటు కూతురును తీవ్రంగా మందలించాడు. వేరే కులానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారాన్ని మానుకోవాలని హెచ్చరించాడు. లేకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. భార్యతో పాటు కూతురిపై చేయిచేసుకొన్నాడు. ఇంట్లో గొడవ జరిగినట్టుగా ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. ఇంట్లో పలు చోట్ల రక్తం మరకలు కూడ ఉన్నాయి. 

తల్లీ కూతుళ్లుపై కిరోసిన్ పోసి చంపేస్తానని హెచ్చరించాడు. నీవు చంపడం ఎందుకు మేమే చనిపోతామని కూతురికి నిప్పంటించి తాను కూడ నిప్పు పెట్టుకొంది తల్లి. దీంతో వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారిద్దరూ మరణించారు.

ఈ ఘటన విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.