హైదరాబాద్: తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కన్న తల్లిని పొట్టన పెట్టుకున్న కీర్తిని పోలీసులు అరెస్టు చేసారు. ప్రియుడితో కలిసి తల్లి రజితను ఆమె చంపేసిన విషయం తెలిసిందే. హత్యను కప్పి పుచ్చేందుకు డ్రామాలు ఆడింది.

తల్లి రజిత కనిపించడం లేదని తండ్రితో కలిసి ఈ నెల 23వ తేదీన కీర్తి హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కీర్తి, ఆమె ప్రియుడు కలిసి రజితను హత్య చేసినట్లు తేల్చారు. 

తల్లి రజితను కీర్తి ఈ నెల 19వ తేదీన హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. మూడు రోజుల పాటు ఇంట్లో ఉంచుకుని ప్రియుడితో కలిసి 21వ తేదీన తల్లి శవాన్ని రామన్నపేట రైల్వే ట్రాక్ పై పడేసినట్లు కీర్తి అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. 

Also Read: ఇద్దరితో లవ్: తల్లిని చంపి శవం పక్కనే మూడు రోజులు ప్రియుడితో..

ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు ప్రియుడితో కలిసి కూతురు తల్లిని హతమార్చింది. రామన్నపేటకు చెందిన పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి బ్రతుకు దెరువు నిమిత్తం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి మునగనీర్ లో నివాసం ఉంటున్నారు. 

కూతురు కీర్తి ఇద్దరు యువకులతో ప్రేమ వ్వహారం నడిపిస్తున్న విషయాన్ని తల్లి రజిత (38) గుర్తించింది. కూతురు కీర్తిని తల్లి రజిత మందలించింది. దాంతో కక్ష పెంచుకుని ప్రియుడితో కలిసి హతమార్చింది. 

తండ్రి లారీ డ్రైవర్ గా డ్యూటీకి వెళ్లగా తల్లి మృత దేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ప్రియుడితో కలిసి కీర్తి ఇంట్లో మూడు రోజుల పాటు గడిపింది. దుర్వాసన రావడంతో అదే ప్రియుడి సహాయంతో స్వగ్రామం రామన్నపేట సమీపంలో రైలు పట్టాల వద్ద మృతదేహాన్ని పడేసింది. 

తాను విశాఖపట్నం పర్యటనకు వెళ్లానని తండ్రికి చెప్పి ఇంటి వెనకాల ఉండే మరో ప్రియుడితో కీర్తి గడిపింది. తండ్రి శ్రీనావాస్ రెడ్డి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.