హైదరాబాద్: తల్లి రజితను కీర్తి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు వెలుగు చూసింది. కీర్తి అమ్మ మెడకు చున్నీ చుట్టి, చేతులు పైకెత్తకుండా గట్టిగా పట్టుకుంటే ప్రియుడు కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. తల్లి గుండెలపై కూర్చున చున్నీ బిగించి హత్య చేసింది.

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మునగనూరులో తల్లి రజితను ప్రియుడి సహాయంతో కీర్తి హత్య చేసి శవాన్ని రామన్నపేట రైల్వే ట్రాక్ మీద పడేసిన విషయం తెలిసిందే.  కీర్తి, శ్రీనివాస రెడ్డి దంపతులకు కీర్తి ఒక్కగానొక్క కూతురు. గారాబంగా పెంచుతూ వచ్చారు. ఆమె హైదరాబాదులోని దిల్ షుక్ నగర్ లో గల ఓ ప్రైవేట్ కళాశాలలో బిఎస్సీ బయో కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతోంది. 

Also Read: ఆస్తి కోసమే కీర్తితో శశి ప్రేమాయణం, తల్లిపై ద్వేషం పెంచి... హత్యకు కుట్ర

కీర్తి గతంలో అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమాయణం నడిపింది. అతనితో కీర్తి తిరుగుతుండడంతో కుటుంబంలో గొడవలు వచ్చాయి. ఇద్దరూ ఒకే కులానికి చెందినవారు కావడంతో సర్దుబాటు చేసి, గొడవ సద్దుమణిగేలా చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల కీర్తి ప్రవర్తనపై అనుమానం రావడంతో తల్లి రజిత బెంగపెట్టుకుంది. ఉండబట్టలేక ఓ రోజు నిలదీసింది. తల్లి మాటలను వినకుండా కీర్తి ఆమెపై కక్ష పెంచుకుంది. 

తల్లిని చంపేసి మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచింది. ఆ మూడు రోజులు ప్రియుడితో గడిపింది. శవం దుర్వాసన వేస్తుండడంతో ఎక్కడైనా పడేయాలని ప్రేయసీప్రియులు అనుకున్నారు ప్రియుడు శశి అలియాస్ చంటి బయటకు వెళ్లి కారు తెచ్చాడు. ఈ నెల 22వ తేదీన కారులో రజిత శవాన్ి తీసుుని రామన్నపేటుకు 6 కిలోమీటర్ల దూరంలో గల తుమ్మలగూడెం వద్ద రైల్వే పట్టాలపై పడేశారు. 

Also Read: ఇద్దరితో లవ్: తల్లిని చంపి శవం పక్కనే మూడు రోజులు ప్రియుడితో...

శ్రీనివాస రెడ్డి, రజిత దంపతుల బంధువులు చాలా మంది విదేశాల్లో ఉన్నారు. కీర్తిని బాగా చదివించి అమెరికా సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకున్నారు. లారీ డ్రైవర్ గు పనిచేస్తున్న భర్త సంపాదనను రజిత కూడబెట్టి, 150 గజలా స్థలాన్ని కొని ఇల్లు కట్టింది. అమెరికా సంబంధం చూసి పెళ్లి చేయాలని రజిత అనుకుంటున్న సమయంలో కీర్తి ఈ దారుణానికి ఒడిగట్టింది.

Also Read: లవ్ అఫైర్, తల్లిని చంపిన కీర్తి ఈమెనే: తండ్రి ఏమన్నారంటే..