సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వంతెనపై నుంచి వెళ్తున్న లారీ పెద్దవాగులో కొట్టుకుపోయింది. సిద్ధిపేట జిల్లాలోని బస్వాపూర్ వద్ద వంతెనపై నుంచి రెండు మీటర్ల ఎత్తు నుంచి పెద్దవాగు ప్రవహిస్తోంది.

శనివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో అటుగా వెళ్తున్న లారీ పెద్దవాగులో పడి కొట్టుకుపోయింది. డ్రైవర్ ఓ చెట్టుకుని పట్టుకుని వేలాడుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 

డ్రైవర్ ను కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తగిన చర్యలు వెంటనే చేపట్టాలని మంత్రి హరీష్ రావును జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేశారు. 

హైదరాబాదు, వరంగల్ నుంచి ప్రత్యేక రెస్క్యూ టీమ్ లను రప్పించి లారీ డ్రైవర్ ను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను సూచించారు.