Kishan Reddy: ఏప్రిల్ మొదటి వారంలోనే లోక్ సభ ఎన్నికలు: బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ మాసం తొలి వారంలో జరుగుతాయని కిషన్ రెడ్డి అన్నారు. 17 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని తెలిపారు.
 

lok sabha elections will held first week of april month says kishan reddy kms

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరుగుతాయని తెలిపారు. తూప్రాన్‌లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర నిర్వహించింది. ఈ యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు భవిష్యత్ లేదని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ.. ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని పేర్కొన్నారు. 

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవడం కూడా కష్టమేనని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయిన పార్టీలు అని, అవి కుటుంబ పార్టీలు అని విమర్శించారు.ఇదిలా ఉండగా.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు. కానీ, ఈ రెండు పార్టీలు బీజేపీని దెబ్బ తీయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

Also Read: LS Polls: కాంగ్రెస్, బీజేపీ హుషారు.. ఉలుకులేని బీఆర్ఎస్!

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ స్థానంలోనూ బీజేపీ జెండా ఎగురుతుందని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే అవి వృథా అవుతాయని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios