రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సడలింపు సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. అలాగే ఇంటికి వెళ్లేందుకు మరో గంట సమయం ఇచ్చింది.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సడలింపు సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. అలాగే ఇంటికి వెళ్లేందుకు మరో గంట సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగింపునకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రో సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలుత ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ రిలాక్సేషన్ సమయం ఇవ్వడంతో అప్పుడు మెట్రో కూడా అప్పటి రిలాక్సేషన్ సమయానికి అనుగుణంగానే నడిచింది. మలివిడత లాక్‌డౌన్ విధించినప్పుడు రిలాక్సేషన్ సమయం మరో మూడు గంటలు పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Also Read:లాక్‌డౌన్ పొడిగింపు, రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్‌కమిటీ: తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలివే..!!

ఈ క్రమంలోనే మెట్రో సమయం విషయంలో కూడా మార్పు చేశారు. తాజాగా రేపటి నుంచి సడలింపు సమయం సాయంత్రం 5 గంటల వరకు వుండటంతో మెట్రో వేళల్ని పొడిగించింది. దీనికి అనుగుణంగానే రేపటి నుంచి మెట్రో సర్వీసుల సమయం పెరిగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందించనుంది. చివరి మెట్రో రైలు సాయంత్రం 5 గంటలకు బయలుదేరనుంది.