తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వైరల్ గా మారుతూ ఉండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఊహించని రీతిలో ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి మరో ఎనిమిది రోజులు పొడిగిస్తూ ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. 

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వైరల్ గా మారుతూ ఉండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఊహించని రీతిలో ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నెల 22 నుంచి మరో ఎనిమిది రోజులు పొడిగిస్తూ ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించింది ప్రభుత్వం. 

అంతటితో ఆగుతుందా? ఇంకా పొడిగిస్తారా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. మరో వారం పాటు అని కొందరు, జూన్ 15 వరకు అంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు. లాక్ డౌన్ పొడిగింపు పై కసరత్తు సాగుతోందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

లాక్ డౌన్ పొడిగింపు పై ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో వాస్తవం ఏమిటనే దానిమీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు పొడిగిస్తారా? లేదా? అనే విషయంలో ఆరా తీస్తున్నారు.

కాగా నగరంలో లాక్ డౌన్ నేపథ్యంలో మూడు కమిషనరేట్ పరిధిలో సుమారు మూడు వందల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అయినా జనం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. చాలాచోట్ల దుకాణాలు తెరిచి ఉండటం, వాహనదారులు సంచారం వంటి విషయాలు పోలీసుల దృష్టికి వెళ్ళాయి. ఫలితంగా ఈ నెల 22 నుంచి లాక్ డౌన్ పొడగింపు నాటి నుంచే నిబంధనలను కఠినతరం చేసి, ఏకంగా పోలీసు బాసులే రంగంలోకి దిగారు.

ఈనెల 22 నుంచి స్వయంగా రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి లాక్‌డౌన్‌ అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పర్యటించిన ఆయన, పలు చెక్పోస్టుల వద్ద లాక్‌డౌన్‌ బందోబస్తును స్వయంగా పరిశీలించారు.

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు ఆస్కారం లేకుండా ఉండాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. క్రమం తప్పకుండా మూడు రోజుల పాటు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయన తిరిగారు. ముగ్గురు సీపీలు కూడా రోజుకు నాలుగు నుంచి ఆరు గంటల పాటు రోడ్ల పైనే ఉంటూ వారి కమిషనరేట్ పరిధిలో ఉన్న వివిధ పోలీస్స్టేషన్లలో ఏరియాలో తిరిగారు. 

చెక్పోస్ట్ దగ్గర సిబ్బంది సంఖ్య, వారి పనితీరు, ఉల్లంఘనలు చేసిన వారి పట్ల తీసుకుంటున్న చర్యలను గమనిస్తున్నారు. డీజీపీతో సహా సీపీలు, ఇతర ఉన్నతాధికారులు సీరియస్గా పరిశీలిస్తున్నారని భావించిన సిబ్బంది నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ రోడ్ల మీదే ఉంటటూ నిబంధనలుఅమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు ప్రధానమని అందరూ భావించాలని ప్రజలు సహకరించాలని ఆయా అధికారులు కోరుతున్నారు.