మహబూబ్‌నగర్‌లో వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు: 25 మందిని కాపాడిన స్థానికులు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. వరద నీటిలో చిక్కుకున్న బస్సులో 25 మంది విద్యార్దులున్నారు. బస్సును కూడా వరద నీటి నుండి బయటకు తీశారు.
మహబూబ్‌నగర్: ఉమ్మడి Mahabunagar జిల్లాలో School Bus కు తృటిలో ప్రమాదం తప్పింది. Flood water నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సులో ఉన్న 25 మంది విద్యార్ధులను స్థానికలు కాపాడారు. బస్సు driver వరద నీటి నుండి బస్సును ముందుకు తీసుకెళ్లాడు. అయితే బస్సు వరద నీటి మధ్యలోకి వెళ్లిన తర్వాత నిలిచిపోయింది.
kodurur-Machanapally వద్ద వరద నీటిలో స్కూల్ బస్సు చిక్కుకుపోయింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్ధులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఈ కేకలు విన్న స్థానికులు బస్సు వద్దకు చేరుకొని బస్సులోని విద్యార్ధులను బయటకు తీశారు. Ramachandrapuram నుండి Suguru వైపు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. భారీ వర్షాలతో కోడూరు-మాచినపల్లి వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోయింది. Railway వంతెన కంది అండర్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి గుండా వాహనాలు ప్రయాణీస్తాయి. అయితే వర్షం నీరు అంబర్ బ్రిడ్జిలో భారీ గాచేరింది.
also read:Telangana Rain: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఐఎండీ హెచ్చరికలు జారీ
అయితే వరద నీటి నుండి బస్సు వెళ్తుందని భావించిన డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. అయితే వరద నీటిలోకి మధ్యలోకి వెళ్లిన కొద్దిసేపటికే బస్సు ఇంజన్ ఆగిపోయింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్ధులు కేకలు వేశారు.ఈ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వరద నీటిలోకి దిగి బస్సులో ఉన్న విద్యార్ధులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. బస్సులో ఎల్ కే జీ నుండి ఐదో తరగతి విద్యార్ధులున్నారు. బస్సు కిటీకీ వరకు వరద నీరు చేరడంతో బస్సు వరద నీటిలోనే మునిగిపోయింది.
విద్యార్ధులను తీసుకెళ్లేందుకు వెళ్లే సమయంలో అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు అంతగా లేదని డ్రైవర్ చెబుతున్నాడు. అయితే తిరిగి వచ్చే సమయంలో భారీ ఎత్తున వదర నీరు చేరింది. అయితే వరద నీరు పెద్ద ఎత్తున చేరుకుంది. అయితే ఈ నీటి గుండానే డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాడు. దీంతో బస్సు నీటి మధ్యలోనే నిలిచిపోయింది.నిన్నటి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోయింది. మహబూబ్ నగర్ పట్టణంలో సుమారు 7 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు నిలిచిపోయింది.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కోరుతున్నారు. అయితే స్కూల్ విద్యార్ధులను తీసుకెళ్లే డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్సు నుండి విద్యార్ధులను బయటకు తీసుకు వచ్చిన తర్వాత బస్సును కూడా ట్రాక్టర్ సహాయంతో వరద నీటి నుండి బయటకు తీశారు.