రాజస్థాన్‌లో తెలంగాణ పోలీసులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఓ చోరీ కేసు విచారణ నిమిత్తం వరంగల్ నగరంలోని సుబేదార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ శివకుమార్ మరో ఇద్దరు కానిస్టేబుల్‌తో కలిసి రాజస్థాన్‌లోని హెర్నియా గ్రామానికి వెళ్లారు.

నిందితులను గాలించి.. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దొంగలను పోలీసుల బారి నుంచి కాపాడేందుకు గాను స్థానికులు దాడికి దిగారు.

ఈ ఘటనలో ఏఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ పోలీసులు వీరిని బేల్వాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. స్థానికులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.