ఎంసెట్ ర్యాంకర్ ప్రాణాలు బలితీసుకున్న లోన్ యాప్ ల వేధింపులు..

ఎన్ని చర్యలు తీసుకున్నా లోన్ యప్ వేదింపులు రోజురోజుకూ శృతి మించుతూనే ఉన్నాయి. తాజాగా వీటి బారిన పడి ఓ ఎంసెట్ ర్యాంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 

loan apps Harassment, EAMCET ranker suicide in hyderabad

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న లోన్ యాప్ ల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినచర్యలు తీసుకుంటున్నా వీటి ఆగడాలు తగ్గడం లేదు. తాజాగా పదివేల రూపాయలు అప్పు 19 ఏళ్ళ యువకుడి ప్రాణాలు తీసింది. ఎంసెట్ లో రెండువేల ర్యాంకు సాధించి.. బీటెక్ కౌన్సిలింగ్ కోసం హైదరాబాద్కు వచ్చిన విద్యార్థి రుణయాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉన్నత చదువులకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడంతో అతని తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. 

ఆర్జీఐఏ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ సమీపంలోని నగునూరు కు చెందిన  శ్రీధర్, పద్మ దంపతులు  వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు మునిసాయి (19) ఉన్నారు.  వీరిద్దరిని చదివిస్తున్నారు. ఇటీవల మునిసాయికి ఎంసెట్లో  రెండువేల ర్యాంకు వచ్చింది. బీటెక్ కౌన్సిలింగ్ నిమిత్తం హైదరాబాదుకు వచ్చాడు. స్నేహితుడి రూమ్ లో ఉంటున్నాడు.  వ్యక్తిగత ఖర్చుల కోసం ఎం- ప్యాకెట్,  ధని యాప్ లలో నాలుగు నెలల క్రితం రూ.10వేలు రుణం తీసుకున్నాడు. 

లోన్‌యాప్స్ కేసులో కొత్త కోణం : రిక్వెస్ట్ పంపకుండానే ఖాతాల్లోకి డబ్బు, ఏడు రోజుల్లో కట్టాలంటూ బెదిరింపులు

జరిమానాల పేరిట యాప్ ల నిర్వాహకులు భయపెట్టి ఇప్పటికే రూ.45వేలు  వసూలు చేశారు. మరో రూ. 15000 చెల్లించాలని తీవ్రంగా బెదిరించారు. అంతేకాదు అతని గురించి సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించడంతో.. పరువు పోతుందని మనస్థాపంతో.. ముని సాయి ఈ నెల 20న పురుగుల మందు తాగాడు. స్థానికులు అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కుమారుడిని బతికించుకోవడానికి రూ. మూడు లక్షలకు పైగా ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios