లోన్ యాప్‌ల కేసులో మరొకరు అరెస్ట్: ఇప్పటివరకు రూ. 300 కోట్లు సీజ్

లోన్ యాప్‌ల కేసులో మరొకరిని హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఏపీ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

loan app case:hyderabad police arrested rajashekar in Banglore lns

హైదరాబాద్:లోన్ యాప్‌ల కేసులో మరొకరిని హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఏపీ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.రాజశేఖర్ బెంగుళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు.  9 మంది లోన్ యాప్ లకు అతను డైరెక్టర్ గా ఉన్నాడు. 

ఇన్‌స్టంట్ లోన్ లు ఇచ్చే లోన్ యాప్ లు.. లోన్లు తీసుకొన్నవారిని వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులు బరించలేక తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ కేసులో ఇప్పటివరకు 26 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 300 కోట్లను సీజ్ చేశారు.

లోన్ యాప్ ల నుండి రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించని వారిని యాప్ నిర్వాహకులు తీవ్రంగా ఇబ్బందుుల పెట్టేవారు. ఈ వేధింపులు భరించలేక పలువురు పోలీసులను ఆశ్రయించారు. మరికొందరు ాత్మహత్యలు చేసుకొన్నారు.

దీంతో ఈ యాప్ నిర్వాహకులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే చైనాకు చెందిన కొందరు డైరెక్టర్లుగా సంస్థలు నడుపుతున్నట్టుగా తేలింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios