కాంగ్రెసోళ్లు మందు తాగి అసెంబ్లీకి వచ్చారు

lla rajeswar alleges Congress members entered Assembly drunk
Highlights

  • మందు తాగొచ్చినోళ్లను సస్పెండ్ చేయాలి
  • వారిని అరెస్టు చేసి శిక్షించాలి

కాంగ్రెస్ ఎమ్మెల్యే కొందరు మందు తాగి అసెంబ్లీకి వచ్చారని సంచలన ఆరోపణలు గుప్పించారు శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి. అసెంబ్లీ ఆవరణలో పల్లా మీడియాతో మాట్లాడారు. సభలోనే కొందరు సభ్యులు తప్పతాగి వచ్చి విపక్ష నేత జానారెడ్డి మీద తూలి పడ్డాడని ఆరోపించారు. వెంటనే ఆయన సభ నుంచి బయటకు వెళ్లిపోయాడని తెలిపారు.  ఆయన ఏమన్నారో చదవండి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు మద్యం తాగి సభకు వచ్చారు. ఇది దురదృష్టకరం. ఒక సభ్యుడు తప్పతాగొచ్చి తూలుతూ జానారెడ్డి మీద పడిపోయాడు. అప్పుడు ఆ సభ్యుడు బూతులు మాట్లాడారు. ఆ క్షణంలో ఆయన బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ ను గాయపరిచే దురుద్దేశంతోనే మైక్ విసిరివేశారని ఆరోపించారు. ప్లాన్ చేసుకుని భౌతిక దాడికి పాల్పడడం దురదృష్టకరం. నాలుగేళ్లుగా ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ప్రస్టేషన్ తో ఇలా చేశారన్నారు. 

సభలోకి తాగి రావడం.. స్వాగి గౌడ్ ను గాయపర్చడం, లాంటి చర్యలకు పాల్పడిన వారిని మిగతా ఏడాది పాటు సస్పెండ్ చేయడంతోపాటు అరెస్టు చేయాలి.

loader