హైదరాబాద్: మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం నుండి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో గుడుంబాను అరికట్టేందుకు గాను మద్యం దుకాణాలను తెరిచే ఉంచే సమయాన్ని పెంచాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలను ఈ ఏడాది మే 6వ తేదీన  ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే మద్యం దుకాణాలను తెరిచి ఉంచుతున్నారు. ఇక నుండి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు మద్యం దుకాణాలను  తెరిచి ఉంచనున్నారు. 

ఏపీ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మద్యం రేట్లు తక్కువే.దీంతో ఏపీ రాష్ట్రానికి అక్రమ మార్గంలో తెలంగాణ నుండి మద్యాన్ని తరలిస్తున్నారు. ఏపీ రాష్ట్రంలో పలు చోట్ల తెలంగాణ నుండి మద్యం తరలిస్తున్న సమయంలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేస్తున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. 

ఇవాళ్టి నుండి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలను తెరిచి ఉంచనున్నట్టుగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 

తెలంగాణలో తెరుచుకున్న వైన్ షాపులు: చాంతాడులా క్యూలు

తెలంగాణను సీఎం కేసీఆర్‌ గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చారని పేర్కొన్నారు. బెల్లం సరఫరా, అక్రమమద్యం సరఫరా, గుడుంబా తయారు చేసేవారి సమాచారం తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. గుడుంబా తయారీ దారుల సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన ప్రకటించారు.