హైదరాబాద్: మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫరిచ్చింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. బార్లు, క్లబ్బులకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఇచ్చింది.

 

కొత్త సంవత్సరం వేడుకలను బహిరంగంగా నిర్వహించడంపై పోలీసులు నిషేధించారు. గేటేడ్ కమ్యూనిటీ హాల్స్ లో కూడ నూతన సంవత్సర వేడుకలపై బ్యాన్ విధించారు.

అయితే మద్యం విక్రయాలకు మాత్రం తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ నెల 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు  మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు క్లబ్బులు, పబ్ లకు  ఈ నెల 31వ తేదీ రాత్రి 1 గంట వరకు  అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

కరోనా నేపథ్యంలో  బహిరంగంగా పార్టీలు చేయడంపై  పోలీసులు ఆంక్షలు విధించారు. స్టార్ హాటల్స్  కు రోజువారీ కార్యక్రమాలకు యధావిధిగా అనుమతి ఇస్తున్నట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించిన విషయం తెలిసిందే.