మందుబాబులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గం.ల వరకు మద్యం షాపులకు అనుమతి..
డిసెంబర్ 31న మద్యం విక్రయించే వ్యవధిని తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. లైసెన్స్ హోల్డర్లు అర్ధరాత్రి వరకు తమ వ్యాపారాన్ని నిర్వహించవచ్చని Excise Department పేర్కొంది. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ఈ అనుమతులు ఇచ్చారు. బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఈవెంట్‌లు ఉదయం 1 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించబడ్డాయి.
హైదరాబాద్ : తెలంగాణలో New Year celebrationల మీద బ్యాన్ విధిస్తూ గతంలో చేసిన ప్రకటనను ప్రభుత్వం సడలించింది. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటల వరకు Liquor shops తెరిచి ఉంచేందుకు సోమవారం అనుమతులు ఇచ్చింది. మద్యం విక్రయించే వ్యవధిని పొడిగించింది. లైసెన్స్ హోల్డర్లు అర్ధరాత్రి వరకు తమ వ్యాపారాన్ని నిర్వహించవచ్చని Excise Department పేర్కొంది. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ఈ అనుమతులు ఇచ్చారు. బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, ఈవెంట్‌లు ఉదయం 1 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించబడ్డాయి.
అంతకుముందు మీడియా సమావేశంలో, ఆరోగ్య మంత్రి T Harish Raoమాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ -19 పరిస్థితి స్థిరంగా ఉందని అన్నారు. “పాజిటివిటీ రేటు 10% కంటే ఎక్కువగా ఉంటే, ఆసుపత్రులలోని 40% బెడ్స్ కరోనా రోగులతో నిండిపోయినట్లైతే.. పరిమితులు విధించాలని, ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కోరిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.6% మాత్రమే ఉందని.. కేంద్రం చెప్పిన దాని దరిదాపుల్లో కూడా మనం లేమని హరీశ్ రావు అన్నారు. అందుకే ఈ సడలింపులు అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, కరోనా విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.. వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఆవశ్యకతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోందని ఆరోగ్య మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే "మాస్క్‌లు పెట్టుకోని వారికి జరిమానా విధిస్తున్నామని.. దీనికి విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తుంది" అని మంత్రి చెప్పుకొచ్చారు.
తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై బ్యాన్.. జనవరి 2 వరకు ఆంక్షలు, హద్దు మీరితే
కాగా.. కొద్దిరోజుల క్రితం తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో డిసెంబర్ 25 నుంచి జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో వుంటాయని సర్కార్ ఉత్తర్వుల్లో తెలిపింది. ఒమిక్రాన్ కట్టడికి మరిన్ని చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. మాస్క్ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు విపత్తు నిర్వహణచట్టం కింద ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయనుంది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించారు.
కొద్దిపాటి నియంత్రణ చర్యలతోనే జనం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనుంది ప్రభుత్వం. ఆయా కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. వేదికల ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారి నుంచి రూ.1000 జరిమానా విధించనున్నారు.
రెండురోజుల క్రితం న్యూఇయర్, క్రిస్‌మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఆదేశాలు జారీ చేసింది.కరోనాపై Telangana High Court గురువారం నాడు విచారణ నిర్వహించింది.ఈ విచారణ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. Maharashtra,delhi ప్రభుత్వాల మాదిరిగానే New year, christmas వేడుకలపై ఆంక్షలను పెట్టాలని తెలంగాణ హైకోర్టు సూచించింది.