హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని తెలంగాణలో భారీగా మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రతి రోజూ సగటున వంద కోట్ల విలువైన మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. వారం రోజుల్లో సుమారు వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక గ్రేటర్లో పెరిగిన మద్యం అమ్మకాలు పెరిగాయి. 

నవంబర్ 23న రూ.135 కోట్లు, 24న రూ. 107 కోట్లు, 25న 102 కోట్లు 26న రూ. 58 కోట్లు, 27న రూ.170 కోట్లు, 28న రూ. 176 కోట్లు, 29న రూ. 108 కోట్ల మద్యం విక్రయాలు పెరిగినట్టుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

సాధారణ రోజుల కంటే  40 శాతం అధికంగా మద్యం విక్రయాలు చోటు చేసుకొంటున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. 2019 నవంబర్ 29న  రూ.,2,239 కోట్ల విలువైన  మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. ఈ ఏడాది అదే రోజున రూ,2567 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 

రంగారెడ్డి జిల్లాలో 317 , మేడ్చల్ రూ. 42 కోట్లు, మెదక్ లో రూ. 100 కోట్లు విలువైన  మద్యం విక్రయాలు జరిగాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 
మొత్తం రూ. 615 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు.