Asianet News TeluguAsianet News Telugu

విదేశీ మద్యం వరదే

  • వరదలా పారనున్న విదేశీమద్యం
  • త్వరలో ప్రత్యేక షాపులు
  • ఏడాదికి రూ. 1.25 కోోట్ల ఫీజు
liquor

దీపావళి సందర్భంగా మందు ప్రియులకు శుభవార్త. విదేశీ మద్యం కొనగలిగి కూడా అందుబాటులో లేదని బాధపడుతున్న మందు ప్రియులకు ఇక ఆ బాధ అవసరం లేదు. త్వరలో విదేశీ మద్యం షాపులను ప్రజల ముంగిటికి తీసుకురావాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారి చేసింది. ఇక, తాగాలనుకున్న వారికి తాగినంత విదేశీమద్యం. ఫారిన్ లిక్కర్ అమ్మకాలకు త్వరలో కొత్తగా షాపులను తెరవాలని కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇటువంటి షాపుల్లో కనీసం 100 బ్రాండ్లకు తక్కువగా అమ్మటానికి మాత్రం అనుమతించరు. అంటే ఎటువంటి బ్రాండ్ కావాలన్నీ దొరకటం ఖాయం.

    ఇప్పటికే ఉన్న మద్యం షాపులకు, త్వరలో అనుమతించనున్న విదేశీ మద్యం షాపులకు స్పష్టమైన తేడా ఉంటుంది. ఈ షాపులకు ప్రభుత్వం ‘ ఎలైట్ అవుట్ లెట్’ అని నామకరణం కూడా చేసింది. ఈ నెల 26వ తేదీన జారీ అయిన ఉత్తర్వులు (కాన్ఫిడెన్షియల్) రహస్య ఖాతాలో ఉన్నాయి.

ప్రస్తుతమున్న వైన్ షాపుల్లో స్వదేశీ మద్యంతో పాటు కొంత మేరకు విదేశీ మద్యాన్ని కూడా అమ్ముతున్నారు. అయితే, ఆ షాపుల్లో అమ్మే విదేశీమద్యం చాలా తక్కువ. అందుకని విదేశీ మద్యం కొనాలనుకున్న వారికి పూర్తి స్ధాయిలో అన్నీ బ్రాండ్లు అందుబాటులో ఉండటం లేదు. ఈ షాపులు తెరవటానికి వేలం పాటల్లాంటివేమీ ఉండవు. ఎవరికైనా, ఎన్నైనా ఇస్తారు.

  అయితే, ప్రస్తుతం నగరంలోని బంజారా హిల్స్, జూబిలీహిల్స్, కొండాపూర్, మాదాపూర్ లాంటి కొన్ని ప్రాంతాల్లో విదేశీమద్యం అమ్మే  షాపులు సుమారు 25దాకా ఉన్నాయి. అయితే, నగరంలోని మందుబాబుల అవసరాలను అవి ఏమాత్రం తీర్చటం లేదు. అదే విషయాన్ని గమనించిన ప్రభుత్వం మందుబాబులకు విదేశీమద్యాన్ని అందుబాటులోకి తెస్తే ఎలాగుంటుందని తీవ్రంగా యోచించి పై నిర్ణయం తీసుకుంది.

ఈ విదేశీమద్యం అమ్మే షాపుల్లో అమ్మకానికి పెట్టే మద్యం కనీస ధర మాత్రం రూ. 2000కన్నా తక్కువుండకూడదు. ఇక వైన్ బాటిల్ కనీస ధర కూడా వెయ్యి రూపాయలకన్నా తక్కువుండేకు లేదనే షరతులను ప్రభుత్వం విధించింది.

  అయితే ఎన్ని విదేశీమద్యం షాపులకు లైసెన్స్ లు ఇచ్చేదీ అన్న విషయాన్ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేయలేదు. కానీ, సూపర్ బజార్లు, షాపింగ్ మల్స్, మల్టీప్లెక్సులలో అమ్ముకోవచ్చని మాత్రం చెప్పింది. అదే విధంగా విదేశీమద్యాన్ని అమ్మే షాపులు ఒక్క హైదరాబాద్ లోనే అమ్మాలని ఏమీ లేదు. వ్యాపారం బాగా జరుగుతుందని నిర్వాహకులు అనుకున్న ఏ ప్రాంతంలోనైనా షాపులు తెరుచుకోవచ్చు.

కాకపోతే వార్షిక ఫీజు క్రింద ప్రభుత్వానికి రూ. 1.25 కోట్లు చెల్లించాలి. పైగా ఈ షాపుల్లోనే ‘టేస్టింగ్ ’ పేరుతో పర్మిట్ గదులను కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎటువంటి ప్రత్యేక రుసుము చెల్లించక్కర్లేదు. షాపులను జాతీయ, రాష్ట్ర రహదారులకు 50 మీటర్ల లోపున కూడా ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కాకపోతే, ఈ విషయంలోనే ప్రభుత్వం కాస్త ఆలోచిస్తే మంచిదేమో.

Follow Us:
Download App:
  • android
  • ios