తల్లిని హత్య చేసిన తనయుడికి జీవిత ఖైదు
మద్యం తాగేందుకు తల్లిని డబ్బులు అడిగేతే ఇవ్వకపోవడంతో ఆ కూమారుడు క్రురంగా మారాడు. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తల్లిని హతమార్చాడు. ఈ కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

మద్యానికి బానిసై కన్న తల్లిని పొట్టనబెట్టుకున్న హంతకుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకెళ్లే.. 2020లో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోని శాంతినగర్, చింత కుంట గ్రామానికి చెందిన భూక్య కళ్యాణ్ విలాస జీవితం కు అలవాటు పడ్డాడు. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తాను తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని తన తల్లి అయిన భూక్య రేణుకను ఘర్షణ లో గొంతు నులిమి హత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై బాధితురాలి తమ్ముడు రంగా నాయక్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు మంగళవారం కరీంనగర్ జిల్లా కోర్ట్ నందు విచారణకు వచ్చింది. ఈ సందర్బంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ V.వెంకటైశ్వర్లు సాక్షులను ప్రవేశపెట్టగా.. తగు విచారణ జరిపిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి B. ప్రతిమ సాక్షాధారాలను పరిశీలించి నిందితునికి జీవిత ఖైదుతో పాటు 5000/- రూపాయల జరిమానా ను విదించారు. నిందితులకు శిక్ష పడేలా కృషిచేసిన SHO, D.చంద్ర శెఖర్, CMS ASI తిరుపతి, HC సత్యం లను కరీంనగర్ పోలిస్ కమీషనర్ సుబ్బరాయుడు అభినందిచారు.