నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అడవి మన్ననూర్ దర్గ చిరుత పులి సంచారం అధికమైంది. శ్రీశైలం అంతరాష్ట్ర రహాదారిపై చిరుతపులి సంచరిస్తుండడంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం, రాత్రి వేళల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాహనదారులు తమ ప్రయాణం రద్దు చేసుకోవాలని ఫారేస్ట్ అధీకారులు సూచిస్తున్నారు. ఒక కారు ప్రయాణిస్తున్న వేళ చిరుత కనిపించింది. ఆ చిరుతను వీడియోలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్ అవుతోంది. మీరూ చూడండి ఆ వీడియో కింద ఉంది.