Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్‌పోర్ట్‌ ర‌న్ వేపై చిరుత‌..! శంషాబాద్ లో కలకలం.. !! (వీడియో)

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై చిరుత కలకలం సృష్టించింది. ప్రయాణికులను, సిబ్బందిని భయాందోళనలకు గురి చేసింది. ఇటీవలి కాలంలో తెలంగాణలో పెరిగిన చిరుతల సంచారం కలవరపెడుతోంది. 

Leopard at shamshabad airport runway in Hyderabad - bsb
Author
Hyderabad, First Published Jan 18, 2021, 10:53 AM IST

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై చిరుత కలకలం సృష్టించింది. ప్రయాణికులను, సిబ్బందిని భయాందోళనలకు గురి చేసింది. ఇటీవలి కాలంలో తెలంగాణలో పెరిగిన చిరుతల సంచారం కలవరపెడుతోంది. 

"

మరోవైపు.. అక్కడక్కడ పులులు కూడా కనబడడం, మనుషులపై దాడులు చేయడం ఇప్పటికే ఇద్దరి ప్రాణాలను సైతం తీయడంతో హడలిపోతున్నారు. తాజాగా.. హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. 

ఎయిర్‌పోర్ట్‌ ప‌రిస‌రాల్లో సంచరించిన చిరుత ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఏకంగా ర‌న్ వేపైకే వచ్చింది. రన్‌వేపై దాదాపు 10 నిమిషాల పాటు చిరుత సంచరించిన‌ట్ట అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యినట్టుగా తెలుస్తోంది.

ఆ త‌ర్వాత చిరుత‌ గోడ దూకి ర‌షీద్‌గూడ వైపు వెళ్లినట్టుగా చెబుతున్నారు. పులి సంచారంతో ఎయిర్‌పోర్టు భ‌ద్రతా అధికారులు అప్రమ‌త్తమ‌య్యారు. మరోవైపు అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ - తుక్కుగుడా దారిలో చిరుత సంచరిస్తున్నట్టుగా ఓ వ్యక్తి డయల్‌ 100కు ఫోన్‌ చేశాడు. 

దీంతో.. అప్రమత్తమైన పోలీసులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.. రంగంలోకి దిగిన అటవిశాఖ ఆధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, పరిసర గ్రామాల్లోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. కాగా, రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ కొంతకాలం ప్రజలను భయాందోళనకు గురిచేసిన చిరుతను ఫారెస్ట్‌ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios