అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై శాసన మండలి ఛైర్మన్ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ రెడ్డిలను అనర్హులుగా ప్రకటిస్తూ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు వీరిపై చర్యలు తీసుకున్నట్లు శాసన మండలి కార్యాలయం వెల్లడించింది. 

తమ పార్టీని వీడి క్లిష్టమైన ఎన్నికల సమయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించిన ఎమ్మెల్సీలను ఎంత తొందరగా అయితే అంత తొందరగా పదవీచ్యుతులను చేయాలని టీఆర్ఎస్ అదినాయకత్వం భావిచింది. అందుకోసం మండలి ఛైర్మన్ స్వామిగైడ్ కు ఫిర్యాదు చేసి తొందరగా వారి సభ్యత్వాలను రద్దు చేయాలని టిఆర్ఎస్ కోరింది. దీనిపై మండలి ఛైర్మన్ కూడా తొందరగానే చర్యలు ప్రారంభించారు. 

అయితే ఎమ్మెల్సీలను తొలగించే విషయంలో ఎలాంటి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు చేకుండా పద్దతిప్రకారం  చేయాలని ఛైర్మన్ స్వామిగౌ భావించారు. అందుకోసం మొదట ఎమ్మెల్సీలకు నోటిసులు పంపించారు. పార్టీ ఫిరాయింపుపై లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఛైర్మన్ కోరారు.  వారు ఇచ్చిన వివరణ ఆధారంగా ఛైర్మన్ విచారణ జరుపారు. 

వీరి విచారణ ప్రక్రియ ముగియడంతో తాజాగా శాసన మండలి ఛైర్మన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు రాములు నాయక్, భూపతి రెడ్డి, యాదవ రెడ్డిలను సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.