Asianet News TeluguAsianet News Telugu

‘సోది క్లాస్’ అంటూ.. సోషల్ మీడియాలో పోస్టు చేసిన విద్యార్థిని.. ఆ లెక్చరర్ రియాక్షన్ తో కథ రివర్స్..

కాలేజీకి వచ్చి బుద్దిగా చదువుకోక.. లెక్చరర్ పాఠాలు చెబుతుంటూ ఫొటో తీసి ‘సోది క్లాస్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందో అమ్మాయి. ఇది ఆ లెక్చరర్ కు తెలియడంతో ఆమెతో పాటు మరికొందరిని చితకబాదింది. 

lecturer beaten students over social media post on her in kamareddy
Author
First Published Nov 30, 2022, 6:49 AM IST

కామారెడ్డి : పాఠం చెబుతున్నప్పుడు ఫొటో తీసి.. ‘సోది క్లాస్’.. అంటూ ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసింది. దీంతో ఆగ్రహించిన టీచర్ ఆమెతో పాటు క్లాస్ లోని మరికొందరు అమ్మాయిలను చితకబాదింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ ఆదర్శ (మోడల్)స్కూల్ లో చోటు చేసుకుంది. ఈ ఉదంతం మీద తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. ఈ మేరకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... 

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నాలుగు రోజుల క్రితం తెలుగు లెక్చరర్ మహేశ్వరి లెసన్ చెబుతుండగా ఓ విద్యార్థిని సెల్ ఫోన్లో ఫోటో తీసింది. సోదీ క్లాస్ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటో పోస్ట్ చేసింది. ఈ విషయం లెక్చరర్ కు తెలిసింది. క్లాస్ రూంలోకి సెల్ ఫోన్ తీసుకురావడమే కాకుండా.. తన ఫొటో ఎందుకు తీశావని సదరు విద్యార్థినిని నిలదీసింది. దీంతో ఆ విద్యార్థిని తప్పయింది. క్షమించమని వేడుకుంది. అయితే కోపం తగ్గని ఉపాధ్యాయురాలు గది తలుపులు పెట్టి అమ్మాయిలను ఒక చోట నిలబెట్టి కొందరిని కర్రతో చితకబాదింది. ఈ ఘటనను కొందరు బాలురు వీడియో తీశారు. 

తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర: ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్

బాలికలు బోరున ఏడుస్తూ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాలకు చేరుకున్నారు. లెక్చరర్ తో వాగ్వాదానికి దిగారు. ఆమెను సస్పెండ్ చేయాలని ధర్నా చేశారు. ఈ  విషయం మీద మహేశ్వరిని అడిగితే సోషల్ మీడియాలో తన ఫొటో పెట్టినందుకు కొట్టిన మాట నిజమేనని ఒప్పుకుంది. ఉన్నతాధికారులకు నివేదిక పంపి, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ లావణ్య పేర్కొన్నారు. మహేశ్వరి మీద ఓ విద్యార్థిని మద్నూర్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. 

విద్యార్థులు టీచర్లను ఏడిపించడం ఇప్పుడొక ట్రెండ్ అయిపోయింది. ముందు ఆ స్టూడెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే పెద్ద తప్పు.. ఆ తరువాత టీచర్ దానికి స్పందించిన తీరు మరింత తప్పు.. ప్రిన్సిపల్ కి చెప్పి.. తల్లిదండ్రులతో వార్నింగ్ ఇప్పిస్తే పోయేది. కానీ ఆమె కాస్త ఎక్కువగా రియాక్ట్ అవ్వడం వల్ల పరిస్తితి చేయిదాటిపోయింది అని స్థానికులు అనుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios