Asianet News TeluguAsianet News Telugu

చేరికలతో టీ.కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు.. అధిష్టానానికి నేతల ఫిర్యాదులు, రేవంత్ వద్దకు పంచాయతీ

ఎన్నికలకు ముందు చేరికలతో టీ కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. కానీ మరోవైపు నియోజకవర్గాల్లో నేతలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరిపై పోరాడామో వారితో కలిసి పనిచేయడం తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నారు. 

leaders disppoints over new joinings in telangana congress
Author
Hyderabad, First Published Jun 26, 2022, 6:53 PM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో (telangana congress) జోష్ కనిపిస్తోంది. చేరికలు కొనసాగుతూ వుండటంతో హస్తం పార్టీ (congress) కొత్త ఉత్సాహంతో వుంది. అయితే చేరికలపై కొందరు నాయకులు అసంతృప్తిగా వుండటంతో కొత్త పంచాయతీలు తెరపైకి వస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ (trs) నుంచి వచ్చే నేతలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేందుకు హస్తం పార్టీ సముఖత వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఓదేలు ఆయన సతీమణితో పాటు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇటీవలే పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి (vijaya reddy), అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 

Also Read:Congress: కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి.. పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

ఇదిలావుంటే ఖమ్మం జిల్లా నేతలు కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తికి కారణమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఎలాంటి సమాచారం లేకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై అశ్వారావుపేట కాంగ్రెస్ నేతలు భట్టికి ఫిర్యాదు చేశారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గం నుంచి డాక్టర్ రవి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై తుంగతుర్తి ఇన్‌ఛార్జి అద్దంకి దయాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkatreddy) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ రవి.. పీసీసీ చీఫ్ రేవంత్‌ను (revanth reddy) కలిసేందుకు వెళ్లగా ఆయన భేటీకి నిరాకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios