హైదరాబాద్:  మద్యం మానేయాలని భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన  ఓ వివాహిత    ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన  హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ కడక్‌పూర్ ప్రాంతానికి చెందిన నాగవెల్లి లక్ష్మి, సికింద్రాబాద్ బోయిన్‌పల్లికి చెందిన రాము  ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరు ప్రస్తతం సికింద్రాబాద్  బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నారు.  కొన్ని మాసాలుగా  లక్ష్మీ మద్యానికి బానిసగా మారింది.

మద్యం తాగొద్దని భార్య లక్ష్మీని  భర్త రాము కోరేవాడు.  అయినా ఆమె అతని మాటలు పట్టించుకొనేది కాదు. రాత్రి పూట తన కొడుకుతో మద్యం తెప్పించుకొని  తాగేది. శనివారం నాడు కూడ మద్యం తాగిన భార్య లక్ష్మిని భర్త రాము తీవ్రంగా మందలించాడు.

భర్త  మందలించడంతో ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు.