సిద్దిపేట: సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం ఖమ్మంపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకొంది. కుటుంబ తగాదాలతో బావ మరిది కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు బావ. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.


ఈ ఘటనలో విమల, సునీత, జాన్‌రాజ్, రాజేశ్వరీ, సునీతకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరిపై లక్ష్మీరాజ్యం పెట్రోల్ పోశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.భార్యతో గొడవ కారణంగానే లక్ష్మీరాజ్యం ఈ దారుణానికి పాల్పడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.