హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఓటమి ఖాయమని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. అందుకు ఆయన ఎన్టీఆర్ ఉదంతాన్ని ప్రస్తావించారు. జాతీయ స్థాయిలో అప్పట్లో ఎన్టీఆర్ చక్రం తిప్పి రాష్ట్రంలో ఓడిపోయారని, అదే ఫలితం కేసిఆర్ కు వచ్చే ఎన్నికల్లో వస్తుందని ఆయన అన్నారు. 

టీఆర్ఎస్ ను ఆయన కాంగ్రెసు తోక పార్టీగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెసుతో సంబంధాలున్న రాజకీయ పార్టీలతో కేసిఆర్ భేటీ కావడం వెనక అంతరార్థం అదేనని అన్నారు. కేసీఆర్ పర్యటనలు కాంగ్రెసుతో ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నాయని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. 

రాహుల్ గాంధీ అనుమతి లేకుండా కేసిఆర్ అంత మందిని కలుస్తారా అని ఆయన అడిగారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. 

బుధవారంనాడు కేసిఆర్ తో భేటీ అయిన ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కర్ణాటకలో బిజెపికి ప్రచారం చేస్తారని అన్నారు. జూన్ నుంచి తాము తెలంగాణలో బస్సు యాత్ర చేస్తామని చెప్పారు. జూన్, జూలై నెలల్లో దాదాపు 50 శాసనసభా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.