కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బస్సు ఢీకొని లక్ష్మణ్ అనే ప్రయాణీకుడు మృతి చెందాడు, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

కామారెడ్డి డిపోకు చెందిన ఏపీ 29 జడ్ 3315 బస్సును డ్రైవర్‌ నడిపాడు. దీంతో బస్సు ఫ్లాట్‌పారంపైకి బస్సు వచ్చింది. బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులపై బస్సు దూసుకెళ్లింది.ఈ ఘటనలో బస్సు  కోసం ఎదురుచూస్తున్న లక్ష్మణ్ అనే ప్రయాణీకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు  ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుడు లక్ష్మణ్  మాచారెడ్డి మండలం ఫరీద్ పేట వాసిగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో ఒకటో నెంబర్ ఫ్లాట్ పారంలో  హైద్రాబాద్‌కు వెళ్లే బస్సులను నిలుపుతారు. అయితే  ఈ ఫ్లాట్ ఫారంపై బస్సులు ఎక్కువగా ఆపుతారు. అయితే మొదటగా తమ బస్సులను నిలిపేందుకు డ్రైవర్లు పోటీ పడుతారు. 

ఇవాళ కూడ  మూడు బస్సులు ఇదే ఫ్లాట్ ఫారంపై నిలిపేందుకు పోటీపడ్డారు. దీంతో కామారెడ్డి బస్సు డ్రైవర్  నిర్లక్ష్యంగా బస్సును ఫ్లాట్ ఫారం వైపు నడిపాడు.  ఆ స్పీడ్‌కు బస్సు ఫ్లాట్‌ ఫారంపై దూసుకు వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసింది.