తెలంగాణ హైకోర్టుకు ఏపీకి చెందిన జడ్జీలను బదిలీ చేస్తున్నారంటూ న్యాయవాదులు బుధవారం ఆందోళనకు దిగారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని న్యాయవాదులు చెప్పారు.
తెలంగాణ హైకోర్టు (telangana high court) వద్ద న్యాయవాదులు (lawyers protest) ఆందోళనకు దిగారు. తెలంగాణకు చెందిన జడ్జిలను (telangana judges) ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తూ.. ఏపీ జడ్జిలను తెలంగాణకు బదిలీ చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ న్యాయమూర్తులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని న్యాయవాదులు చెప్పారు. తెలంగాణ న్యాయమూర్తులను ఎక్కడికీ .. బదిలీ చేయకుండా చూడాలని కోరుతామని వారు స్పష్టం చేశారు.
