మోహన్ అయిపోయింది.... కష్టం అయిపాయే   మన పని అంటూ ఏఈ సుందర్  మరో ఏఈ మోహన్ తో అన్నాడు. ఈ సంభాషణ జరిగిన  కొద్దిసేసట్లోనే వీరిద్దరూ కూడ అగ్ని ప్రమాదంలో మరణించారు


శ్రీశైలం: మోహన్ అయిపోయింది.... కష్టం అయిపాయే మన పని అంటూ ఏఈ సుందర్ మరో ఏఈ మోహన్ తో అన్నాడు. ఈ సంభాషణ జరిగిన కొద్దిసేసట్లోనే వీరిద్దరూ కూడ అగ్ని ప్రమాదంలో మరణించారు. చనిపోతామని తెలిసి కూడ ప్లాంట్ ను కాపాడేందుకు ప్రయత్నించారు. చివరికి ప్లాంట్ నుండి తప్పించుకొనే ప్రయత్నంలో మరణించారు.

also read:శ్రీశైలం పవర్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం: షార్ట్ సర్క్యూటే కారణం...!

ఈ నెల 20వ తేదీన రాత్రి శ్రీశైలం అగ్ని ప్రమాదంలో 9 మంది మరణించారు.ఈ ప్రమాదం జరిగిన సమయంలో మరణించిన ఏఈల సెల్ ఫోన్ లో రికార్డయ్యాయి. విద్యుత్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఏఈ మోహన్, ఏఈ సుందర్ ల మధ్య సంభాషణ చోటు చేసుకొంది. ఏఈ మోహన్ సైరన్ మోగించాడు. కొద్దిసేపు ఆలోచిద్దాం అని ఏఈ మోహన్ అన్నాడు. ఆలోచించే వ్యవధి లేదు అని ఏఈ సుందర్ చెప్పాడు.

పొగ కమ్ముకొందని ఏఈ మోహన్ తో సుందర్ వ్యాఖ్యానించాడు. ఈ రోజుతో మన పని అయిపోయిందన్నారు. ఎవరో వస్తున్నారని మోహన్ ఏఈ సుందర్ తో చెప్పాడు. కానీ ఆలోచించడం వేచి చూడడానికి సమయం లేదని ఆయన చెప్పారు.

ఏఈ సుందర్ అంతకుముందే తన భార్యకు ల్యాండ్ పోన్ నుండి ఫోన్ చేశాడు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పాడు.మన పని అయిపోయిందని చెప్పాడు. కష్టం.. అయిపోయే మన పని అంటూ తప్పించుకొనే ప్రయత్నం చేశాడు. మెట్లపైనే ఏఈ సుందర్ మృతదేహం లభ్యమైంది. 

ఏస్కేప్ ఛానల్ కు సమీపంలోనే నలుగురు ఏఈల మృతదేహాలు దొరికాయి. ఈ ప్రమాదం నుండి తప్పించుకొనే క్రమంలోనే ఈ నలుగురు కూడ ఏస్కేప్ ఛానల్ కు సమీపంలోనే మృతి చెందారు.