హైదరాబాద్:   10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ శాసనమండలిలో సోమవారం నాడు కొత్త రెవిన్యూ బిల్లుపై సీఎం కేసీఆర్  ప్రసంగించారు.  రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏడెనిమిది గంటల పాటు వేచి చూడాల్సిన పని ఇక ఉండదన్నారు.

 భూములు కొనుగోలు చేసే వారంతా తహసీల్దార్ కు ధరఖాస్తు చేసుకొంటే.. వారికి ఏదో ఒక తేదీని రిజిస్ట్రేషన్ కోసం కేటాయిస్తారు. ఆ రోజున భూమిని విక్రయించే వారు కొనుగోలు చేసే వారు వెళ్తే  10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తం 30 నిమిషాల్లో పూర్తి చేస్తారని ఆయన ప్రకటించారు. 

ధరణి పోర్టల్ లో మార్పులు చేసే అధికారం తహసీల్దార్లకు లేదన్నారు.బయోమెట్రిక్,ఐరిస్, ఆధార్, ఫోటోతో సహా అన్ని వివరాలు నమోదు చేస్తేనే ధరణి పోర్టల్ లో మార్పులకు అవకాశం ఉంటుందని సీఎం తేల్చి చెప్పారు. అరగంటలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అప్ డేషన్ ప్రక్రియ పూర్తి కానుందన్నారు.

రెవిన్యూ కోర్టులను రద్దు చేసినట్టుగా ఆయన చెప్పారు. వాటి స్థానంలో ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్ పనిచేస్తాయని సీఎం వివరించారు. కొత్త రెవిన్యూ బిల్లు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని ఆయన చెప్పారు.పలువురు ఎంఎల్‌సీలు అడిగిన సందేహాలను ఆయన తీర్చారు. 

ఆ తర్వాత శాసనమండలి కొత్త రెవిన్యూ బిల్లు ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రయోజనంగా ఉంటుందని ఆయన వివరించారు. వీఆర్ఓ వ్యవస్థను రద్దు కానుంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవిన్యూ బిల్లు ఆమోదం పొందింది. మరో వైపు శాసనమండలిలో ఇవాళ ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇక గవర్నర్ ఆమోదం పొందితే  చట్టంగా మారనుంది.