Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ ఇలాకాలో పోడుభూముల చిచ్చు... గిరిజన మహిళలపై కర్రలతో దాడి (వీడియో)

సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని రెండు గిరిజన గ్రామాల మధ్య పోడుభూముల కోసం వివాదం చెలరేగి రెండు వర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.  

land dispute in two tribal villages siricilla district  akp
Author
Sircilla, First Published Jun 30, 2021, 12:00 PM IST

సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పొడుభూముల వివాదం కలకలం రేపింది. నియోజకవర్గ పరిధిలోని రెండు గిరిజన గ్రామాల మధ్య పోడుభూముల కోసం వివాదం చెలరేగి పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పదిమంది గాయపడ్డారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండా- బావ్ సింగ్ తండాకు చెందిన గిరిజనుల మధ్య పోడు భూముల సాగు విషయంలో వివాదం రేగింది. బావ్ సింగ్ తండాకు చెందినవారు తమ పరిధిలోకి వస్తున్నారని బాబాయ్ చెరువు తండా గిరిజనుల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వీడియో

కొత్తవారు పోడు భూములు సాగు చేస్తున్నారంటూ అడ్డు చెప్పడం రెండు తండాల మధ్య గొడవ మొదలయ్యింది. రెండు తండాల మధ్య పొడు భూముల పంచాయతీ తార స్థాయికి చేరింది. పెద్ద మనుషులు పంచాయతీ చెప్పిన ఫలితం లేకుండా పోయింది.బావ్ సింగ్ తండాకు చెందిన వారు బాబాయ్ చెరువు తండాకు చెందిన మహిళలపై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో 10 మందికి గాయాలయ్యాయి. 
 
గిరిజన తండాల మధ్య గొడవపై సమాచారం అందుకున్నవీర్నపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టడంతో పాటు సంబంధిత అధికారులకు కూడా  సమాచారం అందించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios