వరంగల్ లో టెన్షన్ టెన్షన్ (వీడియో)

వరంగల్ లో టెన్షన్ టెన్షన్ (వీడియో)

వరంగల్ నగరంలో లంబాడీ యువకులు ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో లంబాడీలపై దాడుల నేపథ్యంలో వరంగల్ లో భారీ ర్యాలీ జరిపారు. పెద్ద సంఖ్యలో లంబాడీ యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వారి ఆందోళన తీవ్రమైతున్న తరుణంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్టు చేశారు. వారి ఆందోళనతో నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లంబాడీ ప్రజలపై తెలంగాణలో రోజు రోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడుల నుంచి రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. లంబాడీ నేతల అరెస్టు సందర్భంలో పోలీసులకు, లంబాడీ నేతలకు మధ్య మాటకు మాట, తోపులాట జరిగింది. నాయకులు కార్యకర్తలను అరెస్టు చేసి నగరంలోని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. ఆందోళన వీడియో కింద చూడొచ్చు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos